యుద్ధప్రాతిపదికన భవానీ ద్వీపం పునరుద్ధరణ.


 - సెప్టెంబర్ 1 కల్లా పర్యాటకులకు అనుమతి... 
- వరదల వల్ల భవాని ద్వీపానికి రూ.రెండు కోట్ల నష్టం
-  ముంపు ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు కట్టొద్దు...
-  దాని నిర్మాణం విషయంలోనూ ముందస్తు జాగ్రత్త అవసరం
-  ఏపీకి ప్రాధాన్యమిస్తూ టెంపుల్ , ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం
- ఏపీ టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
 విజయవాడ: ఇటీవలి వరదలకు భవాని దీపానికి, రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని ఏపీ టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.  యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పునరుద్ధరణ పనులు పూర్తిచేసి, సెప్టెంబర్ 1 కల్లా పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇస్తామని చెప్పారు. విజయవాడలోని భవాని ద్వీపాన్ని పర్యాటక కార్యదర్శి ప్రవీణ్ కుమార్. ఏపీ టి డి సి యం డి ప్రవీణ్ లతో కలసి మంత్రి మంగళవారం సందర్శించారు.  మీడియా బృందం తో సహా బోటులో భవాని ఐలాండ్ కు వెళ్లి  వరద నష్టాన్ని పరిశీలించారు.
 జెట్టీలు, సేఫ్టీ వాల్ నిర్మాణంపై దృష్టి పెడతామని, పి.పి.పి. ద్వారా దుర్గ గుడి నుంచి, భవాని ఐలాండుకు రోప్ వే ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని మంత్రి తెలిపారు.


-అమరావతి రాజధని విషయంలోనూ తస్మాత్ జాగ్రత్త!


నీరు పల్లమెరుగు... నిజం దేవుడెరుగు... లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం సహజం... అందుకే లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి... రాజధాని నిర్మాణంలో కూడా జాగ్రత్తలు పాటించాలి...అని టూరిజం మంత్రి పేర్కొన్నారు. అజాగ్రత్తగా నిర్మాణాలు చేపడితే... ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని, రాబోయే తరాలకు  నష్టం చేసినవారవుతామన్నారు.అసలు నదీ పరివాహక ప్రాంతాల్లో శాశ్వత  నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయని, అందుకే తాము భవాని ద్వీపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపడతామన్నారు. ఎకో టూరిజం, అడ్వెంచర్, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు.
 గత ప్రభుత్వంలోలా... బాహుబలి గ్రాఫిక్స్ చూపించం... ఉదయం సింగపూర్... మధ్యాహ్నం చైనా... సాయంత్రం జపాన్ చూపించం... చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తాం... అని ఏపీ టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బదులిచ్చారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image