30–08–2019,
అమరావతి.
గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో వనమహోత్సవం.
సీఎం శ్రీ వైయస్ జగన్తో పాటు వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం.
వనమహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా గుంటూరు జిల్లా అమీనాబాద్ చేరుకోనున్న సీఎం.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో డోకిపర్రు చేరుకుని... వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా డోకిపర్రు వద్ద ముందుగా మొక్కను నాటి... ఆ తర్వాత అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్ధానికంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం అక్కడనుంచి నేరుగా తాడేపల్లి చేరుకుంటారు.