వరద నిర్వాహణలో వైఫల్యాలపై చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్

అంతిమతీర్పు. 23.8.2019


వరద నిర్వహణలో వైఫల్యాలపై చంద్రబాబు ప్రెస్ మీట్- పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ –ముఖ్యాంశాలు
''కృష్ణా వరదల వల్ల ఏపిలో కలిగిన నష్టం వైసిపి ''ప్రభుత్వ ఉద్దేశ పూర్వక విపత్తు''. డిజాస్టర్ మేడ్ బై గవర్నమెంట్ విత్  ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్..
కృష్ణా, గోదావరి 2జిల్లాలలోని 6నియోజకవర్గాలలో  19గ్రామాల్లో రెండు రోజులు పర్యటించాను. వరద బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించాను.
ఏ గ్రామానికి పోయినా హృదయ విదారక సంఘటనలే..లంక గ్రామాల్లో 53వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
వాతావరణ హెచ్చరికల గురించి ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో ఇస్రో ఇస్తుంది, ఎన్ ఎండి ఇస్తుంది, వరద ప్రవాహాల గురించి సిడబ్ల్యూసి ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది. ఇంత సమాచారం ప్రభుత్వం వద్ద ముందే ఉన్నా ఎందుకని సకాలంలో సమర్ధంగా చర్యలు తీసుకోలేక పోయారు..?
అలమట్టి నుంచి నారాయణపూర్ కు కృష్ణ వరద ప్రవాహం 72కి.మీ. దాటాలంటే 12గం పడుతుంది, అక్కడనుంచి జూరాలకు 185కిమీ దాటేందుకు 30గం, అక్కడనుంచి శ్రీశైలంకు 210 కి.మీ చేరేందుకు 30గం, నాగార్జున సాగర్ కు 122కి.మీ చేరేందుకు 12గం, సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజికి 188కి.మీ ప్రయాణానికి 24గం పడుతుందని అంచనా. 
వరద ఉధృతిని బట్టి అటుఇటు స్వల్పంగా తేడా ఉన్నా అలమట్టి నుంచి ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం చేరాలంటే నాలుగున్నర రోజులు పడుతుందని నిపుణుల నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఈ వివరాలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, సరైన కార్యాచరణ చేస్తే ఇంత నష్టం జరిగేదా..? 
ఇక జులై 30నాటికి రిజర్వాయర్లలో నీటిమట్టాల దగ్గరకు వచ్చేసరికి, జూరాలలో 7.29 టిఎంసిల గ్యాప్ ఉంది..శ్రీశైలంలో 181.57 టిఎంసి,నాగార్జున సాగర్ లో 185.75 టిఎంసి,పులిచింతలలో 44.79 టిఎంసిల గ్యాప్ ఉంది. మొత్తం 583టిఎంసిలకు గాను 163.89టిఎంసిలే నిల్వ ఉంది. 419టిఎంసిల గ్యాప్ ఉంది అన్ని రిజర్వాయర్లలో కలిపి...
రాయలసీమ జిల్లాలలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ లో 66.72టిఎంసి, కండలేరులో 64.17 ,వెలిగోడులో 2టిఎంసి,చిత్రావతిలో 9.41 ,బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ లో 16, మైలవరంలో 10,పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10, గండికోటలో 26.85టిఎంసిల నీటి నిల్వకు అవకాశం ఉంది. కడపలోనే 100టిఎంసి, నెల్లూరులో 140,అనంతపురంలో 60-70 టిఎంసిలు పెట్టవచ్చు. చిత్తూరు, కడప రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి.అలాంటిది ఈ రిజర్వాయర్లను నింపుదామన్న ఆలోచనే చేయలేదు...
అలమట్టికి ఇన్ ఫ్లో జులై 29న ప్రారంభం అయ్యింది. 76,305క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉంటే, 91,942 క్యూ అవుట్ ఫ్లో ఉంది. 31వ తేదీన జూరాలకు ఇన్ ఫ్లో ప్రారంభం అయ్యింది. 90,641 క్యూ ఇన్ ఫ్లో ఉంటే, అవుట్ ఫ్లో 18,454క్యూ ఉంది. ఆ తరువాత 2రోజులు 2లక్షల క్యూ చొప్పున రోజుకు వదిలారు. అప్పటిదాకా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి అవుట్ ఫ్లో నిల్.. క్రమక్రమంగా అలమట్టి నుంచి వరద ఉధృతి పెరుగుతోంది. జులై 29నుంచి ఆగస్ట్ 12దాకా 15రోజుల పాటు చాలా సమయం ఉన్నప్పటికీ వరద నియంత్రణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
ఆగస్టు 3న శ్రీశైలంకు ఇన్ ఫ్లో ప్రారంభం అయినా అవుట్ ఫ్లో వదలలేదు. ఆగస్టు 12న నాగార్జున సాగర్ కు 6లక్షల క్యూసెక్కులు వదిలారు. 11న 3లక్షల క్యూసెక్కులు, 12న 6లక్షల క్యూ ఇన్ ఫ్లో సాగర్ కు ఉంటే రెండు రోజులకు కలిపి 60వేల క్యూ మాత్రమే అవుట్ ఫ్లో వదిలారు. 
పులిచింతల నుంచి అవుట్ ఫ్లో 2,64,798 క్యూ చొప్పున ఇన్ ఫ్లో ఆగస్టు 13నుంచి ప్రారంభం అయ్యింది. అయినా 13న 91వేలే అవుట్ ఫ్లో వదిలారు. 
ఏ రిజర్వాయర్ లో ఎంత ఇన్ ఫ్లో ఉంది, ఎంత అవుట్ ఇన్ ఫ్లో వదలాలి అని ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా అవకతవకలు చేశారు.
ఇక 16వ తేదినుంచి 22వరకు క్రిటికల్ డేస్..ఈ పీరియడ్ నే డేంజరస్ గా మార్చారు. 3రోజులు 16నుంచి 18వరకు పులిచింతల నుంచి అకస్మాత్తుగా 6లక్షల క్యూ చొప్పున 3రోజుల పాటు వదిలేశారు. ప్రకాశం బ్యారేజికి ఆగస్ట్ 16న 4,87,638 క్యూ, 17న 7,66,667 క్యూ, 18న 7,51,384 క్యూ చొప్పున వదిలేశారు. 
ఆ 3 రోజుల్లో నీళ్లన్నీ నాగార్జున సాగర్, పులిచింతల నుంచి అకస్తాత్తుగా ప్రకాశం బ్యారేజి మీదకు తోసేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల చొప్పున అదనంగా ఉధృతంగా వదిలినందునే లంక గ్రామాలన్నీ వరద నీట మునిగాయి.
 14వ తేదీన 1,34,160 క్యూ వదిలినవాళ్లు మరుసటి రోజు 3లక్షలు పెంచేసి 4,43,332 క్యూ వదిలారు, తరువాత రోజు మరో 3లక్షలు పెంచేసి 7,49,981 క్యూ వదిలేశారు. ''రాజధాని మునగాలి, మాజీ ముఖ్యమంత్రి ఇల్లు మునగాలనే'' దురుద్దేశంతోనే వరద ప్రవాహాలతో ఆడుకున్నారు, లంక గ్రామాల ప్రజల జీవితాలతో, రైతులతో చెలగాటం ఆడారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్కరోజు సమీక్ష చేయలేదు. మంత్రులు ఒక్క సమీక్ష చేయలేదు. నేను లేనప్పుడు ముగ్గురు మంత్రులు మా ఇల్లు మునిగిపోతుందని చూడటానికి రావడం ఏమిటి..?