ఉపరాష్ట్రపతి  పర్యటనకు సర్వం సిద్ధం


నెల్లూరు : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. మూడురోజుల పాటు ఆయన జిల్లాలో ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు జిల్లాకు వస్తున్నారు.  దీంతో  ఎలాంటి అవాంఛనీయ çఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలన్నింటినీ పోలీసులు శుక్రవారం నుంచే తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లతో పాటు సాయుధ పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా తీర, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 
ఉపరాష్ట్రపతి పర్యటన ఇలా : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 31వ తేదీన హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.35గంటలకు నెల్లూరు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్‌కు  చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన సర్ధార్‌వల్లబాయి పటేల్‌ నగర్‌లోని తన స్వగృహానికి చేరుకుని అక్కడ సేదతీరుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు రోడ్డుమార్గాన వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు వెళుతారు. అక్కడి నుంచి ప్రత్యేక రైల్లో కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వే టన్నల్‌ను పరిశీలి స్తారు. సాయంత్రం 5గంటలకు బయలుదేరి రాత్రి 7గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటా రు. అనంతరం స్వర్ణభారత్‌ ట్రస్టులో రాత్రి బసచేస్తారు. సెప్టంబర్‌ ఒకటోతేదీ ఉదయం 9.30గంటలకు గూడూరు రైల్వేస్టేషన్‌కు వెళతారు. అక్కడ గూడూరు–విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు అక్షర విద్యాలయానికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.20గంటలకు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో మిత్రులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమావేశమవుతారు. అక్కడ నుంచి స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. రెండోతేది వినాయకచవితి వేడుకలను ట్రస్టులోనే జరుపుకుంటారు. 3వ తేదీ ఉదయం 8.20 గంటలకు నెల్లూరు పోలీసు కవాతుమైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో రేణిగుంటకు వెళతారు. 
కేంద్ర సహాయ మంత్రుల పర్యటన : రైల్వేశాఖ కేంద్ర సహాయమంత్రి సురేష్‌ అంగడి రేణిగుంట నుంచి ఉపరాష్ట్రపతితో కలిసి హెలికాప్టర్‌లో నెల్లూరుకు వస్తారు. అనంతరం వెంకయ్యనాయుడుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సెప్టంబర్‌ ఒకటోతేదీన గూడూరులో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రోడ్డుమార్గాన తిరుపతికి వెళతారు. హోం శాఖ కేంద్ర సహాయ మంత్రి సెప్టంబర్‌ ఒకటోతేదీన తిరుపతి రోడ్డుమార్గం ద్వారా గూడూరుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గాన నెల్లూరుకు చేరుకుంటారు. సింహపురి వైద్యశాల వద్ద నుంచి జరగనున్న ఆర్టికల్‌ 370 రద్దు విజయోత్సవ ర్యాలీ సభలో పాల్గొని తిరుపతికి వెళుతారు. 
1,075మందితో బందోబస్తు : పోలీసు యంత్రాంగం 1,075 మందితో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎస్పీతో పాటు, ఏఎ స్పీ, ఎనిమిది మంది డీఎస్పీలు, 19మంది సీఐలు, 58 మంది ఎస్‌ఐలు, 738 మంది సిబ్బంది, 120మంది ఏఆర్‌ సిబ్బంది, 130 మంది స్పెషల్‌ పార్టీ బందోబస్తులో పాల్గొంటున్నారు. 
అప్రమత్తంగా ఉండాలి : ఉపరాష్ట్రపతి, కేంద్రసహాయ మంత్రుల పర్యటన సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సిబ్బందికి సూచించారు. ఆయన పోలీసు కవాతుమైదానంలో బందోబస్తులో పా ల్గొనే సిబ్బందికి సూచనలి చ్చా రు.  అనంతరం ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్‌ కాన్వాయ్‌ నిర్వహించారు.


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ