విశాఖ రైల్వేజోన్ పరిధిని తగ్గించేశారు: కేశినేని నాని

విశాఖ రైల్వేజోన్ పరిధిని తగ్గించేశారు: కేశినేని నాని
విజయవాడ : రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనాన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 17 మంది ఎంపీలు హాజరయ్యారు. విజయవాడ డివిజన్ విస్తరణ, కొత్త రైళ్లు, కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు.. అమరావతి రైల్వే లైన్, దక్షిణ కోస్తా జోన్ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. రైల్వే జీఎంతో సమావేశం నుంచి టీడీపీ ఎంపీ కేశినేని నాని బయటకు వచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది తూతూమత్రంగా సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు కొత్త రైళ్లు, కొత్త లైన్లు అడిగినా ఇవ్వలేదన్నారు. విశాఖ రైల్వేజోన్ పరిధిని తగ్గించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమన్వయంతో పనిచేసి... మన ప్రాజెక్టులు ముందుకు సాగేలా చేయాలన్నారు.