లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి.: మాజీ. ముఖ్యమంత్రి నారా


గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకం ప్రవేశ పరీక్షా పత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి.: మాజీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు


 


, ఫలితాలలో అనేక అవకతవకలు జరిగిన దృష్ట్యా ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. ఏపీపీఏస్సీలో ఉద్యోగుల కుటుంబ సభ్యులకే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, కష్టపడి చదివిన వాళ్ళ మార్కుల్లో కోతలు పడడం, అనేక సార్లు హెల్ప్ లైన్ కు కాల్ చేసినా స్పందన లేదని అభ్యర్ధుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఏపీపీఎస్సీ చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చింది. ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ముందే ఎలా చేరాయి? పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీకేజీ కావడం వల్ల అనర్హులకు ర్యాంకులు దక్కాయి. అర్హులు పూర్తిగా నష్టపోయారు. 56 రోజుల వ్యవధిలో 14 కేటగిరిలలో పరీక్షలు పూర్తి చేశామని, 11 రోజులకే ఫలితాలు వెల్లడించామని గొప్పగా ప్రకటించారే తప్ప, పరీక్ష నిర్వహణ ఎంత ఆధ్వాన్నంగా జరిగిందో ఈ ఫలితాలే వెల్లడిస్తున్నాయి. దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలి. ప్రశ్నపత్రాల లీకేజీకి కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి. మళ్లీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. 


నారా చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత