సచివాలయ పేపర్ ‘లీకేజీ’పై ఏపీపీఎస్సీ చైర్మన్‌‌ను ప్రశ్నించగా...

సచివాలయ పేపర్ 'లీకేజీ'పై ఏపీపీఎస్సీ చైర్మన్‌‌ను ప్రశ్నించగా...
22-09-2019
పేపరు లీకేజీపై అంశంపై తర్వాత మాట్లాడతా
తిరుమల, సెప్టెంబరు 21 : గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ప్రశ్నపత్రం 'లీకేజీ'పై తిరుమలలో ఏమీ మాట్లాడనని, ఈ అంశంపై తర్వాత మాట్లాడతానని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ అన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన, ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. పేపరు లీకేజీపై ప్రశ్నించగా ఈ అంశంపై తర్వాత మాట్లాడతానన్నారు.