కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు:మాజీ మంత్రులు దేవినేని, కొల్లు

*      విజయవాడలో          


మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర విలేఖరుల సమావేశం:*


*ముఖ్యమంత్రి జగన్ పోలవరం విషయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు*


*రద్దుల జగన్ ప్రభుత్వం రాబోయే 1000 రోజుల్లో  తన ప్రభుత్వాన్ని తానే రద్దుచేసుకున్నా ఆశ్చర్యం లేదు*


*రాజ్యాంగం, వ్యవస్థలను కాపాడతామని ప్రమాణం చేసిన జగన్ ప్రభుత్వం కక్షతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది*


*కాంట్రాక్టులను మార్చుకుంటూ పోతే పోలవరం ప్రాజెక్టు భద్రత   ఎవరు వహిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలి*


*4గురు సీఎంల దగ్గర పనిచేసి అందరికీ నచ్చిన పోలవరం ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు మీకెందుకు చెడ్డగా కనిపిస్తున్నారు*


*తమ తాబేదార్లకు పోలవరం ప్రాజెక్టును కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన జగన్ ప్రభుత్వం*


*పోలవరం పనుల నిలిపివేతతో 27వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి*



_విజయవాడ, ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ  జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగంను, వ్యవస్థలను  కాపాడతామని ప్రమాణం చేసి కక్షతో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టులో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, వ్యయం పెరుగుతుందని కేంద్ర జలశక్తి మంత్రి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా,  హైకోర్టు నిర్ణయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది, వైఎస్ హయాంలో పోలవరం పనులు రద్దు వలన 4 సంవత్సరాల ఆలస్యం, రూ.2500 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశాలతో జరుగుతున్న పనులను వేగవంతం చేయడానికి నవయుగ సంస్థకు అప్పగించారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వారి సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్టు పనులను ఆపివేశారన్నారు, పనుల నిలిపివేతతో 27వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి._


_పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుని తప్పించారు, 4గురు ముఖ్యమంత్రులు దగ్గర  పనిచేసిన అందరికీ నచ్చిన ఈఎన్‌సీని మీకు ఎందుకు చెడ్డగా కనిపిస్తున్నారని, ఆయన పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులను చేసినందుకు మీకు బాధగా ఉందా? అని ప్రశ్నించారు, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు అనుమతి సాధించడంలో ఈఎన్‌సీ విజయం సాధించారన్నారు._


_ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ, బెకమ్, నవయుగ సంస్థలు పోలవరం ప్రాజెక్టులో పనిచేసి 70శాతం పూర్తి అయిన తర్వాత జరుగుతున్న పనులు ఆపి కోర్టుధిక్కారం చేసిన జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం తమ తాబేదార్లకు పోలవరం ప్రాజెక్టును కట్టబెట్టడానికి  రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారని, కాంట్రాక్టులను మార్చుకుంటూపోతే పోలవరం ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం విషయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన 48 గేట్లకు సంబంధించిన పనులు జర్మనీలో జరుగుతున్నాయని, దేశ విదేశాల్లో నిపుణుల సమక్షంలో పనులు జరుగుతున్న సమయంలో రివర్స్‌కు వెళ్లడం సరికాదన్నారు. మీ మూర్ఖత్వపు, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు,  రాష్ట్ర ప్రజలకు మీరు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం మీద బురదజల్లేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా చెప్పాలని, గత 5 సంవత్సరాలలో 55వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని, నీటి సంరక్షణలో మనకు దేశంలో రెండవ స్థానం వస్తే ఒక్కమాట అయిన చెప్పారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు లో పునాదులు లేవని జగన్మోహన్‌రెడ్డి గారు వారి పాదయాత్రలో ప్రజలకు ప్రచారం చేశారని, మొన్న లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాపర్ డ్యామ్ చెక్కు చెదరలేదని.. పాదాయత్రలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  రాబోయే 1000 రోజులలో ఈ రద్దుల జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని తనే రద్దుచేసుకున్నా ఆశ్చర్యం లేదన్నారు._


_మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వంద రోజుల పాలనలో జగన్మోహన్‌రెడ్డి పాలన విధ్వంసం, రివర్స్, రద్దులో కొనసాగిందని, ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందోప్రజలకు అర్థమైందని, ఇసుక విధానం ప్రకటించడానికి ఈ ప్రభుత్వంకు మూడు నెలల కాలం పట్టింది, దళారులకు దోచిపెట్టేలా ఇసుకపాలసీ విధానం ఉందని, మద్యం పాలసీలోమద్యం కంపెనీలతో ఈ ప్రభుత్వం లాలూచీ పడి వారి కార్యక్రమాలు చేస్తున్నారు, గతంలో తమిళనాడులో కూడా ఇదే మాదిరిగా చేసి అవినీతికి పాల్పడ్డారని,  100 రోజుల పరిపాలనలో 100కుపైగా వైఫల్యాలను జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని విమర్శించారు._
 
_రివర్స్ టెండరింగ్, రాజధాని, మచిలీపట్నం పోర్టు విషయంలో రివర్స్ నిర్ణయాలు,  అవినీతి అంటూ ఆరోపణలు చేసిన జగన్, ఏ ఒక్క అవినీతిని బయటపెట్టలేకపోయారు. రాజధానిని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. 25 మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ అది మర్చిపోయారు. బీమా లేదు, అన్నా క్యాంటీన్లు లేవు, పెన్షన్ నామమాత్రంగా రూ.250 పెంచారని, మీరు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇదే మాయలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు._


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image