అక్టోబ‌రు 1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమలు

అక్టోబ‌రు 1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమలు
* పూర్తిస్థాయిలో 3500 దుకాణాలు ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ 
అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో ఉద్యోగ నియామ‌కాలు
* త్వ‌ర‌లోనే స‌మ‌యం కుదింపు 
* రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయ‌ణ‌స్వామి 
సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈ సంద‌ర్భంగా శనివారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ మద్యం వలన అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం 450 షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో 3500 షాపులను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీటిని నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలను చేసినట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా అవినీతి జరగకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. 678 కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్ పంపాము. మహిళలు, ప్రతిపక్షం వారు కూడా మద్య విధానానికి, దశలవారీ మద్య నిషేధానికి సహకరించాలి. బెల్టు షాపులు నిర్వహించే వారికి వేరే ఉపాధి కోసం కలెక్టర్లతో మాట్లాడాము. ధరల విషయంలో త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాము. బార్ షాపుల సమయంపై కూడా చర్చిస్తున్నాము. త్వరలోనే కచ్చితంగా సమయం కుదింపు ఉంటుంది. బెల్టు షాపులు పెట్టకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. మహిళలు ఖచ్చితంగా వచ్చి మాకు మద్యం దుకాణం వద్దంటే అక్కడ వాస్తవ పరిస్తితులకు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి తేల్చిచెప్పారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image