శివప్రసాద్‌ మృతి టీడీపీకి తీరనిలోటు : చంద్రబాబు

తేది. 21-09-2019
సంతాపం
శివప్రసాద్‌ మృతి టీడీపీకి తీరనిలోటు
: చంద్రబాబు నాయుడు


    తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్‌ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. శివప్రసాదరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన శ్రమ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటు ముందు వినూత్న రీతిలో తెలిపిన నిరసన దేశ ప్రజలు మరచిపోలేరన్నారు. సాంస్కృతిక శాఖ, సమాచార శాఖ మంత్రిగా అనేక సంస్కరణలకు శివప్రసాదరావు నాంది పలికారన్నారు. చిత్తూరు ఎంపీగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
                                        
                                    మిి