అమ్మవారి సేవా భాగ్యం అదృష్టం
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి సేవా భాగ్యం ఒక అదృష్టమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలో సభ్యులుగా అవకాశం పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటని పేర్కొన్నారు ఇక్కడ మహిళ భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసే బాధ్యత ఉత్సవ కమిటీ సభ్యుల దని పేర్కొన్నారు ఈ ఆలయంలో సేవచేసే భాగ్యం రావడం చిన్న విషయం కాదని పేర్కొన్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఏడాది ఈ ఆలయంలో సభ్యత్వం కావాలని అధిక క సంఖ్యలో కోరే వారని అందువల్ల ఎవరికి ఇవ్వాలో అర్థం అయ్యేది కాదని తెలిపారు కమిటీలో అవకాశం కల్పించిన వారు మంచి సేవలందించి భక్తుల నుంచి మంచి పేరు పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి , రూప్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి , స్వర్ణ వెంకయ్య, అవినాష్, నరసింహ రావు, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.