దసరా నుంచి టీడీపీలో సరికొత్త మార్పులు

తేదీ. 26-09-2019
      
 దసరా నుంచి టీడీపీలో సరికొత్త మార్పులు
     తెదేపా అనుబంధ సంఘాల నుంచే ప్రక్షాళన ప్రారంభం
  మహిళలు, యువత, బడుగుబలహీన వర్గాలకే కార్యవర్గాలలో ప్రాధాన్యం


  తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంతరించుకునే దిశగా చర్యలు ఆరంభమయ్యాయి. అనుబంధసంఘాల కార్యవర్గాల ఏర్పాటును ముందుగా ప్రారంభించనున్నారు. విజయదశమి నుంచి ప్రారంభించి.. నవంబరు నెలాఖరుకు అన్ని అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలోనూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. అనుబంధ సంఘాల కార్యవర్గాలలో యువత, మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు నిర్ణయించిన కీలక సమావేశం గురువారం గుంటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులూ పాల్గొన్నారు. టీడీపీకి పూర్వ వైభవం తేవడానికి ఏం చర్యలు తీసుకోవాలో సమావేశంలో చర్చించారు. పార్టీకి ఉన్న అని అనుబంధ సంఘాలకు నూతన కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ దసరాకు ప్రారంభించి నవంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. అనుబంధ సంఘాలలో 33 శాతం యువత, 33 శాతం మహిళలు, 50 శాతం బడుగు.. బలహీనవర్గాల వారికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. సామాజికవర్గాల జనాభా ఆదారంగా వారికి పదవులలో అవకాశాలు ఇవ్వనున్నారు. అలాగే కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు బాగాలేని వారిని కార్యవర్గంలోని మెజారిటీ సభ్యుల నిర్ణయంతో రీకాల్‌ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ జిల్లా కమిటీలుగానే ఉండేవి. అయితే ఇకపై పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. నవంబరు నెలాఖరుకు అన్ని సంఘాల కార్యవర్గాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం పూర్తి చేయనున్నారు. అనుబంధ సంఘాల ప్రక్షాళనతోనే తెలుగుదేశం పార్టీలోనూ కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్‌, వీవీవీ చౌదరి, మంతెన సత్యనారాయణరాజు, టీడీపీ నాయకులు బీద రవిచంద్ర, గణబాబు, వంగలపూడి అనిత, గౌతు శిరీష, నజీర్‌ అహ్మద్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌, ఎం.ఎస్‌.రాజు, బ్రహ్మం చౌదరి కీలక నేతలతోపాటు అనుబంధసంఘాల బాధ్యులూ పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image