మరోసారి భారీగా వరద వస్తోంది..:సోమిరెడ్డి

🔸నెల్లూరులోని ఆదిత్యనగర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ముంగమూరు శ్రీధరక్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జెన్ని రమణయ్య తదితరులు....


*సోమిరెడ్డి కామెంట్స్*


🔸కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో క్రిష్ణా, గోదావరి నదుల రిజర్వాయర్లలోకి మరోసారి భారీగా వరద వస్తోంది..


🔸చెన్నైతో పాటు రాయలసీమ, నెల్లూరు అవసరాలకు క్రిష్ణా జలాల పర్యవేక్షణ కమిటీ పదిరోజుల క్రితం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిధికి 88 టీఎంసీలు కేటాయించింది...


🔸ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ కు 2.22 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది...ఈ వరద కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ కేటాయింపులు జరుగుతాయి..


🔸పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు డ్రా చేసుకునే అవకాశం ఉంది...


🔸లక్షల క్యూసెక్కుల వరద ఉన్నప్పటికీ 24 వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేస్తున్నారు..ఫలితంగా రోజుకు ఒక టీఎంసీకి పైగా జలాలను కోల్పోతున్నాం..


🔸గత ఏడాది క్రిష్ణా నది పరివాహక ప్రాంతంలో చుక్క వర్షం పడకపోయినా సోమశిలకు 48.5 టీఎంసీలు తీసుకొచ్చాం...


🔸సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో ఈ ఏడాది మొదటి పంట పూర్తి విస్తీర్ణంలో పండించుకునే అవకాశం ఉంది..


🔸సోమశిల 26.95 టీఎంసీలకు చేరుకుంది..డెడ్ స్టోరేజీలో ఉన్న కండలేరుకు ఇప్పుడే విడుదల ప్రారంభించి 8 టీఎంసీలకు చేరిన వెంటనే కండలేరు-పూండి కాలువ ఫంక్షనింగ్ ప్రారంభించాలి..


🔸ఇప్పుడుండే పరిస్థితుల్లో తాగునీటితో పాటు సాగునీరు కూడా అందించవచ్చు..


🔸ఇరిగేషన్ మంత్రి, అధికారులు వెంటనే కలెక్టర్ తో పరిస్థితులను చర్చించి కండలేరుకు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలి..


🔸 కనీసం రోజుకు ఐదారు వేల క్యూసెక్కులు ఇప్పటి నుంచే కండలేరుకు విడుదల చేయాలి..


🔸కండలేరుకు నీటి విడుదలను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో ఇరిగేషన్ మంత్రి, అధికారులు ఆలోచించుకోవాలి...


🔸ఐఏబీ సమావేశం వరకు నీటి విడుదల విషయంలో తాత్సారం తగదు...


🔸మా ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చాం..లోడింగ్, రవాణా చార్జీలు కలిపి నెల్లూరు నగరంలో ట్రాక్టర్ ఇసుక 1000, 1100 రూపాయలకే ఇళ్లకు చేరేది...


🔸ఇప్పుడు ఐదు నెలలు సమయం తీసుకుని టన్ను ఇసుక రూ.375గా నిర్ణయించారు..ట్రాక్టర్ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.2,300 నుంచి రూ.2,500 అయింది..


🔸పాత ప్రభుత్వం కంటే మంచి పాలసీ తీసుకొస్తామని వెయ్యి రూపాయలున్న ట్రాక్టర్ ఇసుకను 2500కి పెంచారు..


🔸ఇసుక లేక అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయి వేలాది మంది కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు...


🔸ప్రభుత్వాలు మారితే పరిపాలన ఆగిపోదు..విధానాల్లో మార్పులు మాత్రమే చేసుకోవచ్చు..


🔸టీడీపీ అధికారం చేపట్టినప్పుడు గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు అదనంగా చేశాం కానీ రద్దులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టలేదు...


🔸మీ ప్రభుత్వ తీరు మీకు ఓట్లు వేసిన వారితో పాటు మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా నచ్చడం లేదనే విషయం గమనించండి..


🔸మా మీద ఎన్ని కేసులైనా పెట్టండి..మీ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొనే సత్తా నాయకులుగా మాకుంది...గ్రామాల్లో చిన్న స్థాయి కార్యకర్తలపై మీ ప్రతాపం చూపించొద్దు..


🔸టీడీపీ కార్యకర్తలపై ఎలా దాడులు చేయాలనేది కాదు...వృధాగా పోతున్న జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూడండి..పరిపాలనపై దృష్టి పెట్టండి...


🔸నాలుగేళ్లలో సగటున 10.5 శాతం వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11.2 శాతం వృద్ధి రేటుతో మీ చేతికి పాలన అప్పగించాం..


🔸ఇప్పుడు వృద్ధి రేటు రోజురోజుకు పడిపోతోంది..


🔸హంద్రీనీవా ఆగిపోవాలి...రాజధాని ఆగిపోవా..పోలవరం ఆగిపోవాలి..అనే వ్యతిరేక ధోరణి తగదు...


🔸ప్రజలను వేధించేందుకు కాదు మీకు అధికారం ఇచ్చింది..


🔸నాపై అయితే కేసులు లేవు..వారిపై కేసులున్నాయి కాబట్టి నన్నూ ముద్దాయిగా మార్చాలని వారి ప్రయత్నం..


🔸నేరుగా పెట్టేందుకు ఏమీ లేవు...పెండింగ్ లో ఉన్న సివిల్ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా కేసు పెట్టించారు..ఏం కాదు న్యాయ స్థానాలే చూసుకుంటాయి..


🔸జిల్లాలో ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది..


🔸ఇళ్లు కూల్చడానికి, రొయ్యల గుంతలు ధ్వంసం చేయడానికి వందల మంది పోలీసులను వినియోగిస్తున్నారు..


🔸కలెక్టర్ ఆదేశాలతోనే పోలీసులు వెళుతున్నారా..లేక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా..


🔸అధికారులు తమ పరిపాలన దక్షతతో అందరికీ రోల్ మోడల్ గా నిలవాలని కోరుకుంటున్నా..


🔸కాలేజీ రోజుల నుంచి రాజకీయాలను చూస్తున్నా..ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు..


🔸జిల్లాలో మరీ ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి...


🔸జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ ఈ పరిస్థితులను సమీక్షించుకుని సరిదిద్దుకోవాలని హితవు పలుకుతున్నా..


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image