ఓర్పు సహనం ఎంతో ముఖ్యం ; విష్ణు వర్ధన్ రెడ్డి

గుంటూరు' సెప్టెంబర్ 23 ( అంతిమ తీర్పు):
బాపట్ల,
నెహ్రు యువకేంద్ర వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి .
*******


 నెహ్రు యువకేంద్రం ,గుంటూరు,ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో.   ఆదివారం ఉదయం     జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వహణలో జాతీయ యువ సేవా కార్యకర్తల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం బాపట్ల  ఎన్. జి.రంగా అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం కు చెందిన జీడిమామిడి మొక్కల పరిశోధనా కేంద్రంలో నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమానికి నెహ్రు యువ కేంద్రం ఆంధ్రప్రదేశ్ శాఖ సంపాదకులు వెంకటేశం అధ్యక్షత వహించారు ఈ కార్య క్తమానికి నెహ్రూ యువకేంద్ర జాతీయ వైస్ ఛైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి   ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెహ్రూ యువాకేంద్ర శిక్షణా తరగతులు కు వచ్చిన సేవా కార్యకర్తలు ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  కూడా ఈ శిక్షణా కేంద్రంలో పనిచేసినవారే దీనిని ఆయనే స్వయంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించి శిక్షణలో 3 గంటలకు పైగా సమయం వెచ్చించారన్నారు.యువతకు ఓర్పు సహనం ఎంతో ముఖ్యమని మనం చేపట్టే ఈ కార్యక్రమంలో 15 రోజుల తరగతులు తీసుకున్నవారు తప్పక వారికి కేటాయించిన పనులను తప్పక చేయాలని, సేవాగుణం కలిగివుండాలని తెలిపారు.కేంద్రప్రభుత్వం ఈ శాఖకు ఏటా 150 కోట్లు వేచ్చిస్తుందని ఈ సొమ్ము వృధా కాకుండా చూడవలసిన బాధ్యత భారతీయులు గా మన అందరిపై వున్నదని అంటే కాకుండా మోడీ గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనలో సేవాగుణం,ఓర్పు,సహనం,నిజాయితీ,నిబద్ధతతో ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో అగ్రదేశం అయిన అమెరికా రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారని మనదేశంలో ఎ ఏ ప్రధానికి దక్కని గౌరవం దక్కింది మోడీకే అని కొనియాడారు.పాత్రకేయులు కు సూచన చేస్తూ శిక్షణా తరగతులు పూర్తి అయ్యాక వారి అభిప్రాయాలు ప్రజల్లోకి తెసుకెళ్లే  బాధ్యత మీపై ఉందని గుర్తు చేశారు.ఆయనతోపాటు మానవ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ చక్రపాణి , హరిప్రసాద్ rtd IRS, నాగసాయి, రవి శంకర్,డైరెక్టర్ కిరణ్మయి,యశస్వి, గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ విరమాచినేని చైతన్య తదితరులు పాల్గోన్నారు.