దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు ఇవే.


విజయవాడ : దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - తిరుపతి : 07607 నెంబరు గల హెచ్‌ఎస్‌ నాందేడ్‌ - తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబరు 1, 8, 15, 22, 29, నవంబరు 5, 12, 19, 26, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో నాందేడ్‌లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి - హెచ్‌ఎస్‌ నాందేడ్‌ : 07608 నెంబరు గల తిరుపతి-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ ప్రత్యేక రైలు అక్టోబరు 2, 9, 16, 23, 30, నవంబరు 6, 13, 20, 27, డిసెంబరు 4, 11, 18, 25 తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి హెచ్‌ఎస్‌ నాందేడ్‌కు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది.
తిరుపతి - నాగర్‌సోల్‌ : 07417 నెంబరు గల తిరుపతి-నాగర్‌సోల్‌ వీక్లి ప్రత్యేక రైలు అక్టోబరు 4, 11, 18, 25, నవంబరు 1, 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో తిరుపతిలో ఉదయం 7.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు నాగర్‌సోల్‌ చేరుకుంటుంది.
నాగర్‌సోల్‌ - తిరుపతి : 07418 నెంబరు గల నాగర్‌సోల్‌ - తిరుపతి ప్రత్యేక రైలు అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో నాగర్‌సోల్‌లో రాత్రి 10 గంటలకు బయల్దేరి రెండోరోజు ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి - కాకినాడ టౌన్‌ : 07432 నెంబరు గల తిరుపతి - కాకినాడ టౌన్‌ రైలు నవంబరు 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబరు 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, 31 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి కాకినాడ టౌన్‌కు మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్‌ - తిరుపతి : 07431 నెంబరు గల కాకినాడ టౌన్‌ - తిరుపతి రైలు నవంబరు 4, 6, 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29, డిసెంబరు 2, 4, 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30, జనవరి 1 తేదీల్లో కాకినాడ టౌన్‌లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
కాచిగూడ - కాకినాడ టౌన్‌ : 07425 నెంబరు గల కాచిగూడ - కాకినాడ టౌన్‌ అక్టోబరు 4, 11, 18, 25, నవంబరు 1, 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో కాచిగూడలో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్‌ - కాచిగూడ : 07426 నెంబరు గల కాకినాడ టౌన్‌ - కాచిగూడ రైలు అక్టోబరు 5, 12, 19, 26, నవంబరు 2, 9, 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో కాకినాడ టౌన్‌లో సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లకు సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, చైర్‌కార్‌, జనరల్‌ బోగీలు ఉంటాయి.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image