ముఖ్యంసాలు

23–09–2019


*1. అక్రమ నిర్మాణాలపై గతంలో ఇచ్చిన నోటీసులకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం..  సీఆర్డీయే పత్రికా ప్రకటన.*


*2. కృష్ణా నదిలో అక్రమకట్టడాలపై చర్యలు, చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమే. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ పత్రికా ప్రకటన.* 


*3. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావుతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. హాజరైన ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డిప్రభాకర్‌రెడ్డి, టిటిడి బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి.* 


*4. పోలవరం రీటెండర్లలో ప్రభుత్వ ఖజానాకు 780 కోట్ల రూపాయలు ఆదా.*
 *హెడ్‌వర్క్స్, పవర్‌ హౌస్‌ రీ టెండర్లను తెరచిన ప్రభుత్వం.*
*గతం కంటే 12.6 శాతం తక్కువకు కోట్‌ చేసిన మేఘా ఇన్‌ఫ్రా, ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల రూపాయలు ఆదా.*


*5. ఇసుక లభ్యతపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సిద్ధంగా ఉందన్న పంచాయితీరాజ్, గనులు, భూగర్భశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వరద తగ్గగానే ఏపీఎండిసి ద్వారా సరఫరాకు సిద్ధం.*


*6. గ్రామ, వార్డు సచివాలయం అభ్యర్ధుల ఎంపిక జాబితాకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్ పై కలెక్టర్లతో మాట్లాడిన అంశాల మీద పంచాయితీరాజ్‌ శాఖ పత్రికా ప్రకటన.* 


*7. ఆంధ్రా, ఒడిషాలకు సంబంధించి వంశధార నదీ జలాల వివాదం పై కీలక ఉత్తర్వులు జారీ చేసిన వంశధార ట్రిబ్యునల్‌. ప్రాజెక్టులో ఒడిషా అభ్యంతరాలను తోసిపుచ్చిన ట్రిబ్యునల్‌. పాత ఉత్వర్వులను మరోసారి పునరుద్ఘాటించిన ట్రిబ్యునల్‌. ఏపీ కి అనుకూలంగా వంశధార ట్రిబ్యునల్‌ నిర్ణయం.*