వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు నేడే అంకురార్పణ !*

⚜ *దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ గాంచిన, వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు నేడే అంకురార్పణ !*


♦ నెల్లూరుజిల్లా : వెంకటగిరిలో... దక్షిణ భారతదేశంలో జరుగు ప్రసిద్ధి గాంచిన జాతరలలో ఒకటైన... వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు నేడు అంకురార్పణ జరగనుంది.


♦ అమ్మవారి జాతరను ప్రారంభించాలంటూ... నేడు వేంకటగిరి సంస్థానం ప్రాంగణంలో, రాజకుటుంభీకులు అమ్మవారి సేవకులకు సంప్రదాయ తాంబూలం అందించనున్నారు. అనంతరం ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తరువాత అమ్మవారి జాతరకు మొదటి చాటింపు వేయనున్నారు. 


♦ చాటింపు సందర్భంగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తరువాత... వెంకటగిరి గ్రూప్ దేవస్థానముల ఆధ్వర్యంలో, వెంకటగిరి పట్టణంలోని నడిబొడ్డున ఉన్న అమ్మవారి ఆలయం వద్ద ఆసాదులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పురవీధుల్లో డప్పు వాయిద్యాలు మ్రోగిస్తూ, సరిహద్దు పొలిమేరల్లోకి వెళ్లి ఈ వారం మొదటి చాటు... పైవారం రెండవ చాటు... ఆపై వారం "పోలేరమ్మ నిలుపహో" అంటూ చాటు వేస్తారు. ఇలా చాటు వేయడంలోని పరమార్థం, రాబోయే అమ్మవారి జాతరకు పొలిమేర్లలోని సకల దేవతలను ఆహ్వానించడమేనని ప్రతీతి.


♦ ప్రస్తుతం నేటి బుధవారం అర్ధరాత్రి మొదటి చాటింపు వేయగా, రెండవ చాటింపు ఈ నెల 11వ తేదీ బుధవారం రాత్రి వేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ అమ్మవారి "ఘటోత్సవం" తో మొదలయ్యే జాతర, ఈ నెల 18, 19 తేదీలలో... వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగనుంది.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image