భవిష్యత్ లో జిల్లాకొక వృద్దాశ్రమాన్ని  ఏర్పాటు చేస్తాం: రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి తానేటి వనిత


తేది:20.09.2019
అమరావతి


• దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండాలని నిర్ణయించింది


• ఇబ్బందులు లేకుండా వికలాంగుల పెన్షన్ల పంపిణీకి, స్వయం సమృద్ధి కలిగించేందుకు చర్యలు 


• గ్రామ వాలంటీర్ల ద్వారా వృద్దుల పథకాలు అమలు చేస్తాం


• భవిష్యత్ లో జిల్లాకొక వృద్దాశ్రమాన్ని  ఏర్పాటు చేస్తాం: రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి తానేటి వనిత


అమరావతి, సెప్టెంబర్ 20: స్వచ్ఛంధ సంస్థలతో సమావేశం ముగిసిన అనంతరం  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ  మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ  దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉండాలని నిర్ణయించిందని వెల్లడించారు. వికలాంగులకు పెన్షన్లను ఇబ్బందులు లేకుండా పంపిణీ కి తగు చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు మధ్యాహ్నం భోజనం పాఠశాలల్లో సమర్ధవంతంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వికలాంగులకు స్వయం సమృద్ధి కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. వృద్దులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా వృద్దుల పథకాలు అమలు చేస్తామని తెలిపారు. జిల్లాకి ఒక వృద్దాశ్రమాన్ని భవిష్యత్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందడం లేదని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆహారం కూడా సక్రమంగా చేరడం లేదన్నారు. దానిని పూర్తిగా సంస్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి తెలిపారు. 53 శాతం రాష్ట్రంలో ఎనిమియా (రక్తహీనత) ఉందని నీటి ఆయోగ్ చెప్పిందని గుర్తుచేశారు. దానిని తగ్గించేందుకు కృషి చేస్తామని, త్వరలో మంచి విధానాన్ని తీసుకోస్తామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.


 


.........................