ఏడువారాల నగల గురించి సంపూర్ణంగా అర్థం వివరణ

ఏడువారాల నగల గురించి సంపూర్ణంగా అర్థం వివరణ -..............


వరంగల్ :
 *  
ఆదివారమునకు సూర్యుడు అధిపతికీ అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును.


     ఈ రోజుల్లోరవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము(కష్టము) కనుక లేత ఎరుపు గల రవ్వలు తాపడం చేసిన ఆభరణములు ధరింపవలెను.


 *  సోమవారమునకు చంద్రుడు అధిపతి. అతని లోహం వెండి , రత్నము ముత్యం కనుక సోమవారంనాడు చంద్రహారముతో పాటు ముత్యాలదండలు , శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన నగలు , వెండి తీగలతో అల్లిన తావళములు , వెండి దండ కడియములు , ముంజేతి కడియములు ధరించకొవలెను ...


 *  మంగళవారము రోజున కుజుడు అధిపతి. అతనికి లోహం రాగి , రత్నము పగడము కనుక ఈనాడు పగడాల దండ , ముదురు ఎరుపురంగు గల రవ్వలు పొదిగిన తాటంకములు , పతకములు మెదలైనవి. రాగితీగలతో అల్లిన ఆభరణములు , రాగి కడియాలు ధరింపవలెను .


 *  బుధవారమునకు బుధుడు అధిపతి. అతని లోహము కంచు. రత్నము పచ్చ. పచ్చలలో ఆకుపచ్చ , చిలకపచ్చ అని రెండు రకములు కలవు. వానిలో దేనినైనా ధరించవచ్చు . పూర్వము పచ్చలదండలు ప్రసిద్ది. వెండిలేదా బంగారంతో వేపకాయ పూసలు చేయించుకుని వానిని పచ్చల నడుమ గ్రుచ్చుకొని ప్రతివారు ధరించేవారు.


              ఈనాడు కంచు పూసలు , కడియములు , ఉంగరములు లేదా పచ్చలు పొదిగిన పోగులు , పతకాలు , కడియాలు ధరించవచ్చు .


 *  గురువారమునకు బ్రహస్పతి అధిపతి. అతని లోహము ఇత్తడి , రత్నము పుష్యరాగం . గురువారం నాడు ఇత్తడి లేదా వన్నె తక్కువ బంగారంతో చేసిన కడియంలు , ఉంగరములు , పూసలు మొదలైన నగలు లేదా పుష్యరాగములు పొదిగిన ఆభరణములు ధరించవలెను .


 *  శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. ఇతని లోహం తగరం , రత్నం వజ్రం  . శుక్రవారం నాడు తగరముతో పూసలు , గజ్జెలు మొదలైనవి ధరించవలెను . వెండితో చేసినవి అయినను ధరించవచ్చు . ఆర్ధికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు వజ్రములు పొదిగిన ఆభరణములు ధరించవచ్చు .


 *  శనివారమునకు శనైచ్ఛరుడు అధిపతి. అతని లోహము ఇనుము , రత్నము నీలము . ఇనుమును ఆభరణాలకు ఉపయోగించరు కాని కొందరు కడియాల రూపములో ధరిస్తారు. నీలములలో రెండు రకములు కలవు. ఒకటి నీలం రెండొవది ఇంద్రనీలం . నీలము నలుపు రంగులో ఉండును. ఇంద్రనీలం బ్లూ రంగులో ఉండును. ఇందులో ఏదైనను ధరించవచ్చు . నీలాల ను చెవిపోగులలో , ముక్కెరలలో పొదుగుదురు .


           స్త్రీలు ఆభరణములను ఈ విధముగా వారమును అనుసరించి గ్రహావివేకము కలిగి ఆయా లోహములతో చేసినవి గాని , ఆయా రత్నములు తాపడం చేసినవిగాని పుష్పములతో పాటు ధరించిన యెడల ఆయా గ్రహముల యొక్క క్రూరదృష్టి నుండి తొలగినవారై సుఖమును పొందుదురు.


                      గ్రహబలం చాలనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన రత్నములను , లేదా జన్మరాశిని అనుసరించిన గ్రహములకు సంబంధించిన రత్నములను గాని ఉంగరము లేదా లాకెట్టుల యందు శాశ్వతముగా ధరించుట మంచిది . స్త్రీలకు ఎప్పుడైనను రంగురంగుల వస్త్రములు ఇష్టపడుచుందురు. కనుక వారు వారములను అనుసరించి ఆది , మంగళవారముల యందు ఎరుపు రంగు , సోమ , శుక్రవారముల యందు ఆకుపచ్చ రంగు , గురువారం నాడు పసుపురంగు , శనివారం నాడు నలుపు లేదా నీలపు రంగు గల చీరలను ధరించిన యెడల వారు ఆయా గ్రహములను ఆరాధించినట్టుగా అగును. ఆ రోజుల్లో చీర అంతయు ఆరంగు లేకున్నను దాని అంచు అయినను ఆ రంగు కలదిగా చూచుకొని ధరించుట మంచిది . అదేవిధముగా గృహము వాకిళ్ళలో కూడా వారమును అనుసరించి ఆయా రంగులతో ముగ్గులను వేయుచున్న ఆ గృహమునకు శోభా శక్తి తో పాటు అనేకంగా భక్తి కలిగి ఉన్నాయి శాస్త్రము చెబుతున్నది ఈ విధంగా మహిళలు పాటించాలి.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image