వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం


వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం  – విచ్చలవిడిగా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు, నిషేదిత కలుపు మందులు -గుంటూరు జిల్లా  బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు
వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం విచ్చలవిడిగా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు, నిషేదిత కలుపు మందులు, ప్రభుత్వం నిషేదించిన కలుపు మందు అమ్మకాలు రాష్ట వ్యాప్తంగా గుంటూరు, విజయవాడ కేంద్రంగా యద్దేచగా సాగుతున్నాయని భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేసారు. 


ప్రస్తుతం రైతులు నకలీ పురుగు మందులు, నాణ్యత లేని పురుగు మందులు విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతున్నాయని తెలిపారు. వేటిని అరికట్టవలసిన భాద్యత వ్యవసాయ అధికారులపై ఉన్నదని తెలియజేసారు. ఇలాగ ప్రతి సంవత్సరం జరుగుతున్నదని, కాని వీటిని నియత్రించవలసిన అధికారులు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారని, ఇలా ప్రతి సంవత్సరం వ్యవసాయ అధికారులు విఫలమవుతూ రైతులను నట్టేట మున్చుతున్నారని  ఆవేదన వ్యక్తం చేసారు. 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల భీమా పధకాలను అమలు చేస్తుంటే, క్షేత్ర స్టాయీ అధికారులు పధకాలను రైతులకు అవగాహనా కలిగించటం లో  వ్యవసాయ అధికారులు విఫలమైనారని,  కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ ఆధారిత భీమా పధకాలను అమలు చేస్తున్నాయని, కాని ఈ పధకాలు మాత్రం రైతులకు అవగాహనా కలిగించడంలో విఫలమవుతున్నారని తెలిపారు. బ్యాంకు ద్వార ఋణం తీసుకోని వాళ్ళు కూడా ఈ పధకాలలో చేరవవచ్చని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నదాతల కోసం కొత్తగా ప్రధానమంత్రి కిసాన్‌ పెన్షన్‌(పీఎంకేపీవై) పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించిందని,  ఈ పథకంలో నమోదు చేసుకోవడం వల్ల రైతులు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చునని, 2 హెక్టార్ల వరకు భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హలని, ఇది వాలంటరీ క్రంటిబ్యూషన్ ఆధారిత పెన్షన్ స్కీమ్ అని, 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చునని, కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుందని, వయసు ప్రాతిపదికన చెల్లించే మొత్తం మారుతుందిఅని, రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఫండ్‌కు చెల్లిస్తుందని, భార్యా భర్తలిద్దరూ విడివిడిగా చెల్లించి విడివిడిగా పెన్షన్ పొందొచ్చుఅని, ఇప్పటికైనా  క్షేత్ర స్టాయీ అధికారులు  రైతుల పై శ్రద్ధ పెట్టి రైతులకు వ్యవసాయంపై సస్యరక్షణ పద్దతులు,  రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ రకాలైన పధకాలపై సరైన అవగాహన కల్పించాలని, అధికారుల విలువైన సమయాన్ని రైతు సేవకోసం ఉండాలని భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు కోరారు.


 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image