ఫ్యాన్ కి ఉరేసుకొని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

నెల్లూరులో విషాదం


ఫ్యాన్ కి ఉరేసుకొని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య


నెల్లూరు: నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. భర్త వేదింపులు తాకలేక నాగలక్ష్మీ అనే మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అశోక్ తనను నిత్యం వేధించేవాడని మనస్తాపానకి గురైనట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఎస్పీ కార్యాలయంలో కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ నాగలక్ష్మి పనిచేస్తుంది. భర్త అశోక్ వేధింపులు తాళలేక నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు కూడ తెలిపారు. నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్న నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ ని  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.