టిడిపిలో చేరిన అరకు ఏజెన్సీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు

టిడిపిలో చేరిన అరకు ఏజెన్సీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు
విజయనగరం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన సర్పంచులు,మాజీ సర్పంచులు,ఇతర ప్రజా ప్రతినిధులు 100మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం గుంటూరు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి, అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,'' వంద రోజుల వైసిపి పాలనలోనే విరక్తి పుట్టి టిడిపిలో చేరడం శుభసూచకం. పేదల పక్షాన నిలబడాలంటే టిడిపితోనే సాధ్యమని గ్రహించి పార్టీలో చేరిన అందరినీ స్వాగతిస్తున్నాం.
మూడున్నర నెలల్లో వైసిపి నేతలు సాధించిందేమీ లేదు, 499 దౌర్జన్యాలు,దాడులు తప్ప...8మంది టిడిపి నేతలను పొట్టన పెట్టుకున్నారు. భూముల కబ్జాలు, తప్పుడు కేసులు,ఆస్తుల విధ్వంసం,అరాచకాలే వైసిపి ఘనత. సమస్యల పరిష్కారం వీళ్లకు చేతకాదు.
గత 5ఏళ్లలో ఎస్టీల సంక్షేమానికి రూ.14,210కోట్లు వ్యయం చేశాం. రూ.526కోట్లతో కాఫీ సాగును, అంతర పంట సేద్యాన్ని ప్రోత్సహించాం.
కట్టెల పొయ్యి మీద వంట చేసే దుస్థితి గిరిజన మహిళలకు లేకుండా చేసేందుకే 79వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశాం. 4,528మంది ఎస్టీ విద్యార్ధుల విదేశీ విద్యకు రూ.378కోట్లు వ్యయం చేశాం. 100యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేసి కరెంట్ బిల్లులు తగ్గించాం. పెండ్లి కానుకగా ఎస్టీ ఆడబిడ్డలకు రూ.50వేలు అందజేశాం. ఫీడర్ అంబులెన్స్ లు, బైక్ అంబులెన్స్ ల ద్వారా తండాలలో వైద్యం పెంచాం. మలేరియా, డెంగీ విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాం. రూ.1500కోట్లతో రోడ్లను అభివృద్ది చేశాం.
సుందర పర్యాటక కేంద్రంగా అరకును చేసేందుకు గత 5ఏళ్లలో ఎంతో కృషి చేశాం. నేనే ఈ ప్రాంతాన్ని దత్తత చేసుకుని అభివృద్ధి చేశాం. పోషకాహారం, వైద్యం అందించి, ఉపాధి కల్పించి జీవన ప్రమాణాలు మెరుగు పరిచాం. పుట్టుక నుంచి జీవితాంతం వరకు ప్రతిదశలో పేదలకు సంక్షేమం అందించాం.
పండుగ కానుకలు, గిరిగోరుముద్దలు, రూ1కే కిలో బియ్యం అందజేశాం.
 రూ.120కోట్లతో ఫుడ్ బాస్కెట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. చంద్రన్న బీమా కింద రూ.5లక్షలు పరిహారం అందించాం. 
పించన్ రూ.200నుంచి రూ.2,000 చేశాం, 10రెట్లు పెంచాం. అలాంటిది ఇప్పుడు కేవలం రూ.250పెంచి వైసిపి నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. టిడిపి గెలిచివుంటే పించన్ ఇప్పటికే రూ.3,000అయ్యేది. ఒకటో తేదీనే పించన్లు టిడిపి హయాంలో అందించగా, ఇప్పుడు ప్రతినెలా 2వ వారం వచ్చినా ఇవ్వడం లేదు.
అంగన్ వాడి భవనాలు, పంచాయితీ భవనాలు, గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం. 
టిడిపి పాలనలో ఇసుకు ఉచితంగా అందించగా, ఇప్పుడు ఇసుక కొరత సృష్టించి వైసిపి ఎమ్మెల్యేలు,ఎంపిలు వాటాలేసుకుని దోచుకుంటున్నారు.
పేదలకు రూ.5కే పట్టెడన్నం పెట్టే అన్నా కేంటిన్లు మూసేసి నిరుపేద కుటుంబాల పొట్టకొట్టారు.
అన్నా కేంటిన్లపై పసుపు రంగును, ఎన్టీఆర్ బొమ్మను చూడలేక పోయారు వైసిపి నేతలు. వాటికి వైసిపి రంగులేసి, తండ్రీకొడుకుల బొమ్మలు అంటించి, పేర్లు మార్చి మూసేశారు. మూసేసే కేంటిన్లకు వైసిపి రంగుల ఖర్చు ఎందుకు దండగ చేశారు..?
గిరిజన ఏజెన్సీలో రాజశేఖర రెడ్డి బాక్సైట్ తవ్వకాలకు లీజులిస్తే, గిరిజనుల మనోభావాలను గౌరవించి టిడిపి ప్రభుత్వం బాక్సైట్ లైసెన్స్ లను రద్దు చేసింది.
వైసిపి దౌర్జన్యాలకు గురైన టిడిపి కార్యకర్తలకు పునరావాస కేంద్రం ఏర్పాటుచేశాం. బాధిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం అందించడమే కాకుండా లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం అందిస్తాం.
బెదిరించి ఒకరిద్దరిని చేర్చుకుని అదే బలం అని వైసిపి అనుకుంటోంది, అది బలం కాదు వాపు మాత్రమే..కొందరు నకిలీలే టిడిపిని వీడుతున్నారు తప్ప నిజమైన కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడరు..
రాజధానిలో రైతులిచ్చిన 34వేల ఎకరాల భూముల్లో టిడిపి ప్రభుత్వం చేపట్టిన పనులు అన్నింటినీ నిలిపేశారు.
రాబోయే రోజుల్లో అరకు నియోజకవర్గంపై టిడిపి జెండా ఎగరడం తథ్యం. ఒకప్పుడు గిరిజన ప్రాంతాలన్నీ టిడిపికి కంచుకోటగా ఉండేవి. గత రెండు ఎన్నికల్లో ఆదరణ తగ్గింది, మళ్లీ గిరిజన ప్రాంతాల్లో టిడిపికి పూర్వ వైభవం తెస్తాం'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
టిడిపిలో చేరిన వారిలో వైసిపి సమన్వయ కర్త సివేరి దొన్నుదొర, పెట్టావి రాము(గన్నెల మాజీ సర్పంచి), కిల్లో జగన్ కుమార్(శిరగాం సర్పంచి), పెదకాపు అర్జున్(గన్నెల సర్పంచి), సవేరి దామోదర్(భూర్జ సర్పంచి), సోమెరి సుబ్బారావు(పెదబిడ్డ సర్పంచ్), కొర్రా పోలన్న(శిరగాం ఎంపిటిసి), గొల్లూరి సుబ్బారావు(కోలపూట్ సర్పంచి), కొర్రా సీతారామ్(సాగర్ సర్పంచి), ఏడే నాగరాజు(పెంగపర్తి సర్పంచి),వంజరపు శంకర్ రావు(విటిడిఏ చైర్మన్ అనంతగిరి) తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి,శివేరి అబ్రహాం, ధారూ నాయక్, ఎంపి గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image