దక్షిణ కొరియా ప్రతినిధుల బృందంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఎలక్ట్రిక్ వాహన రంగం, మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టండి : దక్షిణ కొరియా ప్రతినిధుల బృందంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• రాష్ట్రంలో నదులపై ఎత్తైన వంతెనలు, అత్యాధునిక తరహా ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా ఆసక్తి
• దక్షిణ కొరియా భాగస్వామ్యంతో కార్మిక శక్తిని పెంచుతాం..పారిశ్రామికాభివృద్ధి సాధిస్తాం : పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• ఏపీ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రణపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న కొరియా ప్రతినిధి
అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదులపై ఎత్తైన వంతెనలు నిర్మించి, అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా కాన్సులేట్, ప్రతినిధుల బృందం ఆసక్తి ప్రదర్శించింది. శుక్రవారం పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో దక్షిణ కొరియా కాన్సులేట్ , ప్రతినిధుల బృందం  సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై, రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులపై  మంత్రి సుదీర్ఘంగా కొరియా ప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటుందో మంత్రి స్పష్టంగా వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీ తీసుకురానున్నామని మంత్రి కొరియా ప్రతినిధి బృందానికి తెలిపారు. ఏపీలో స్టార్టప్ సెంటర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ , మౌలిక వసతులపై చర్చించారు. ఈ - కామర్స్ టూల్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై శిక్షణ, వొకేషనల్ ట్రైనింగ్ ల పైనా చర్చించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడానికి కృషి చేయనున్నామని మంత్రి అన్నారు. భూముల ధృవీకరణ పత్రాలలో అక్రమాలకు తావులేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకునే ఆలోచనలో ఉన్నామని మంత్రి మేకపాటి అన్నారు. త్వరలోనే ఐ.టీ, ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని ప్రతినిధులకు మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై మొదట పరిశ్రమల యాజమాన్యాలు ఆశ్చర్యపోయినా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వివరంగా అర్థం చేసుకుని ప్రభుత్వంతో భాగస్వామ్యం అవడానికి ముందుకొస్తున్నారన్నారు మంత్రి. రాష్ట్రంలో ఎగుమతుల కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా  సానుకూలత వ్యక్తం చేసిందని అన్నీ అనుకూలిస్తే విశాఖలో ఎక్స్ పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.  యువతకు ఉపాధి అవకాశాలను పెంచి, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే  దిశగా వాణిజ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న నవరత్నాలను ముద్రించిన వాల్ పోస్టర్ ను చూసి కొరియా ప్రతినిధి ఆసక్తికరంగా మంత్రిని ప్రశ్నించారు. చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు ఆదాయమంతా మద్యానికే వెచ్చిస్తూ కుటుంబాలను ఆర్థికంగా చితికిపోయేలా చేస్తుండడం గమనించిన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా మద్యాన్ని  నియంత్రిస్తున్నారని మంత్రి సమాధానం చెప్పారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో జరిగిన దక్షిణ కొరియా ప్రతినిధుల సమావేశంలో ఏపీపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్, ఐ.టీ సలహాదారులు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image