ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ
గుంటూరు ; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ శనివారం, 14 సెప్టెంబర్ 2019 నాడు ప్రతి కోర్టు ప్రాంగణంలో నిర్వహించబడుతోంది. అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ పడ దగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు వగైరాలు పరిష్కారానికై ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతోంది. లోక్ అదాలత్ లలో కేసులు పరిష్కరించుకొనుట ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని వేగవంతముగా పొందడంతో పాటు చెల్లించియున్న కోర్టు ఫీజును కూడా వాపసు పొందవచ్చును. కోర్టులలో అనగా సుప్రీంకోర్టు నుండి క్రింది స్థాయి కోర్టులన్నింటిలో పెండింగులో ఉన్న కేసులను తేది. 14.09.2019 (శనివారము) నాడు జరగబోవు జాతీయ లోక్ అదాలత్ లో ఇరు పార్టీలకు అమోద యోగ్యమైన, ఖర్చు మరియు కాలయాపన లేకుండా, అప్పీలు లేని అంతిమ తీర్పును పొందవచ్చును. కావున ప్రజలు/ కక్షిదారులు తమ దగ్గరలోని కోర్టు ఆవరణలో గల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి, ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను సత్వరముగా పరిష్కరించు కొనవచ్చును. లోక్ అదాలత్ సేవలు పూర్తిగా ఉచితము. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న కోర్టు ప్రాంగణములో గల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయములో సంప్రదించ వచ్చును. సభ్య కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ