చేష్టలుడిగి చూస్తున్న జగన్‌ సర్కారు -  చంద్రబాబు

--
 
 తేది 25-09-2019


సమావేశం వివరాలు


భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో వైసీపీ చెలగాటం


ఇసుక కృత్రిమ కొరతతో అవస్థలు


చేష్టలుడిగి చూస్తున్న జగన్‌ సర్కారు


-  చంద్రబాబు నాయుడు


అత్యుత్తమ ఇసుక పాలసీని అందిస్తామన్న వైసీపీ ప్రభుత్వం.. అత్యంత చెత్త పాలసీని రూపొందించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో రూ.3000 వెచ్చిస్తే లారీ ఇసుక ఇంటి వద్దకు వచ్చేదని.. కానీ ప్రస్తుతం రూ.30,000 నుంచి లక్ష రూపాయలు చెల్లించినా దక్కే పరిస్థితి లేదన్నారు. సమూల మార్పులంటూ హడావుడి చేసిన వైసీపీ ప్రభుత్వం తమ చేతగాని తనంతో.. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజను పస్తులు పెడుతోందన్నారు. కృత్రిమ ఇసుక కొరతతో 33 రకాల వృత్తులకు చెందిన 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. ఏదైనా వ్యవస్థను ప్రక్షాళన చేసినా, నవీకరించినా పని సులువు కావాలి. ధరలు అందుబాటులోకి రావాలి. కానీ ప్రభుత్వ చేతగానితనంతో ఇసుక తరలింపు కష్టంగా మారడంతో పాటు.. సామాన్యుడికి అందని స్థాయికి ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రజల బాధల్ని తీర్చాల్సిన ప్రభుత్వం.. ప్రజలను మరిన్ని కష్టాలకు గురి చేయడం దుర్మార్గమన్నారు.


చంద్రబాబు ముందు గోడు వెల్లబోసుకున్న కార్మికులు


కూలికి వెళ్తే రోజుకు రూ. 600 వచ్చేవని, కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేది కాదని, కానీ నేడు ఈ ప్రభుత్వ చర్యలు వల్ల పనులు లేక  పస్తులుంటున్నామని చంద్రబాబు ముందు భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.   టీడీపీ హయాంలో రోజంతా పని చేసి మూడు పూట్ల అన్న క్యాంటీన్లు వద్ద భోజనం చేసేవారమని కానీ వాటిని రద్దు చేయటంతో  అర్దాకలితో అలమటిస్తున్నామన్నారు. నాలుగు నెలల నుంచి పనులు లేకపోవటంతో  ఇంట్లో పూటగడక, స్కూల్‌ పిల్లలకు పీజులు కట్టే పరిస్థితిలేక ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుమన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


  భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు భరోసా కల్పించారు. కార్యక్రమంలో అమరావతి సెంట్రింగ్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సభా అధ్యక్షులు బాబూరావు, రాష్ట్ర యూనియన్‌ అధ్యక్షులు ధూళిపాళ్ల లీలా మహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జెట్టి రామారావు, యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.
 
 


 
పా