భవిష్యత్తు రైళ్లకు ఇదే నమూనా

భవిష్యత్తు రైళ్లకు ఇదే నమూనా
ఇక కొత్త రైళ్లన్నింటికీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే
విజయవాడ - గూడూరు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతం
ప్రయాణికులకు సౌకర్యవంతంగా అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
కొత్త రైళ్లకు ఈ కోచ్‌లనే తీసుకు వస్తామని ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
విజయవాడ : విజయవాడ - గూడూరు మధ్య ప్రవేశపెట్టిన రైలు నెం.12744/12743 ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరాభిమానాలను చవిచూస్తోందని దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ సర్వీసును ప్రయాణికులు 85 శాతంకు పైగా ఆదరిస్తున్నారని పేర్కొంది. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు అత్యాధునిక లింక్‌ హాఫ్‌మెన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ఉపయోగించటం వల్ల ప్రయాణికులు సౌకర్యవంతంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రైలు విజయవంతం కావటం పట్ల దక్షిణ మధ్య రైల్వే హర్షం వ్యక్తం చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య గురువారం దీనిపై స్పందిస్తూ ప్రజల అంచనాలను అందుకొన్నందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్ర రాజధాని- సింహాపురి మధ్య నడిచే ఈ రైలు తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, బిట్రగుంట, కావలి, నెల్లూరు స్టేషన్ల ప్రాంతాల ప్రజలకు ఒక వరంగా మారిందని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బి ) కోచ్‌లను దక్షిణ మధ్య రైల్వే నూతన రైళ్లలో కోచ్‌లుగా ఉపయోగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. రానున్న రోజుల్లో కొత్త రైళ్లలో ఈ ఎల్‌హెచ్‌బి రేక్‌లనే ఉపయోగిస్తామని అధికారికంగా ప్రకటించింది. విజయవాడ-గూడూరు ఇంటర్‌సిటీ రైలును నూతనంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఉపయోగించామని తెలిపింది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగిన విజయవాడ - గూడూరు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఆకర్షణీయంగానే కాకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపింది. యాంటి టెలిస్కోపిక్‌ (రైలు ప్రమాదం జరిగితే బోగిలు ఒక దానిపై ఒకటి ఎక్కకుండా నియంత్రించే) వ్యవస్థ, అతి తక్కువ బరువు కలిగిన కోచ్‌లు, ఎక్కువ భారాన్ని మోసే సామర్ధ్యం, గంటకు 160 కి.మీ.వేగం, బఫర్‌ కప్లింగ్‌ కలిగి ఉంటుందని, ఇవన్నీ ప్రయాణికుల భద్రతాంశాలేనని ప్రకటించింది. విజయవాడ - గూడూరు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో 14 కోచ్‌లున్నాయని, రెండు ఏసి చైర్‌కార్లు, 4 సెకండ్‌ క్లాస్‌ రిజర్వుడ్‌ సీటింగ్‌ కోచ్‌లు, 8 సాధారణ ప్రయాణికుల కోచ్‌లతో పాటు మొత్తం 1,116 సీట్లు ఉన్నాయని తెలిపింది. ఏసీ చైర్‌కార్‌లో 156 సీట్లు, సెకండ్‌ సిట్టింగ్‌ చైర్‌కార్‌లో 432 సీట్లు, సాధారణ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌లో 528 సీట్లు ఉంటాయని పేర్కొంది. మెరుగైన సిట్టింగ్‌ సదుపాయం, విశాలవంతమైన కిటికీలు, వెంటిలేటెడ్‌ బయో-టాయిలెట్లు, జారడానికి అవకాశం లేని నేల ఈ రైలు లోపలి ప్రత్యేకత లని ప్రకటించింది. నాన్‌ ఏసి కోచ్‌లలో నీటిని శుభ్రపరిచే వ్యవస్థ గల మంచినీటి వసతి మినీ హాట్‌-కోల్డ్‌, ఏసీ చైర్‌కార్‌తో పాటు 3 నాన్‌ ఏసీ కోచ్‌లు, ఏసీ కోచ్‌లలో రైలు కిటీకిలకు రోలర్‌ బ్లైండ్లు, స్లైడింగ్‌ డోర్లు కూడా అమర్చటం జరిగిందని పేర్కొంది. గూడూరు-విజయవాడ మధ్య నడిచే సమయం 4.30 గంటలని, టికెట్‌ ధర కూడా రోడ్డు ప్రయాణంతో పోలిస్తే తక్కువేనని తెలిపింది. ఈ కారణాల వల్లనే ఈ రైలు ప్రజల మన్నలను పొందుతోందని ప్రకటించింది. ఈ రైలు విజయవాడ డివిజన్‌లో హెచ్‌ ఆన్‌ జనరేషన్‌ (హెచ్‌ఓజి) పవర్‌తో నడిచే మొట్టమొదటి రైలుగా గుర్తింపు పొందిందని పేర్కొంది. దీనిలో రైలు నడవడానికి కావల్సిన విద్యుత్‌ ఓవర్‌హెడ్‌ ఎలక్ర్టికల్‌ వైర్ల నుంచి ఎలక్ర్టిక్‌ లోకో మోటివ్‌లకు అందుతుందని తెలిపింది. ఈ వ్యవస్థ వల్ల కర్బన వ్యర్థాలను తగ్గిస్తూ పర్యావరణహితం కల్పించటంతో పాటు ఒక రేక్‌కి ఒక ట్రిప్‌కి ఇంధనం ఖర్చు రూ.49.వేల ఆదాతో సంవత్సరానికి రూ.1.79 కోట్లు ఆదా అవుతుందని ప్రకటించింది.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image