తేది 21-09-2019
జంబో పాలక మండలిని రద్దు చేయాలి - వేమూరి ఆనంద్ సూర్య
ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డుకు జగన్ ప్రభుత్వం జంబో పాలక మండలిని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా అభ్యాంతరాలను, నిరసనను వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలలోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే ఈ పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్రతను, ఆగమ శాస్త్రం విలువలను మంటగొలిపే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కనపడుతున్నాయి. అంతే కాకుండా అన్యమతస్తులు శ్రీవారి ఏడుకొండల మీద పవిత్రతకు భంగం కలిగించేలా వ్యహరిస్తున్న విషయం ఇప్పటికే అనేక సందర్భాలలో తేటతెల్లమైనది. ఈ జంబో పాలకమండలిని వెంటనే రద్దు చేసి, వివిధ పీఠాలకు సంభందించిన పీఠాధిపతులతోను, రాష్టంలో ఉన్న రాష్ట్ర స్థాయి అర్చక, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతోను అన్ని దేవాలయ పాలక మండళ్లను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా హిందువుల మనోభావాలు కాపాడే దిశగా శ్రీ స్వరూపానందేరేంద్ర గారు ఉద్యమించాలని ప్రార్ధన
వేమూరి ఆనంద్ సూర్య
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్