కామినేని హాస్పిటలో..
అంతర్జాతీయ స్థాయి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలు
* డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్‌తో కామినేని హాస్పిటల్స్ భాగస్వామ్యం
, విజయవాడ: ప్రపంచ ప్రఖ్యాత లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ మహ్మద్ రేలా భాగస్వామ్యంతో కామినేని హాస్పిటల్స్ నందు అంతర్జాతీయ ప్రమాణాలతో కాలేయ మార్పిడి విభాగాన్ని ప్రారంభించారు. కామినేని హాస్పిటల్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ లివర్ ఐసీయూని డాక్టర్ మహ్మద్ రేలా శనివారం ప్రారంభించారు. అనంతరం నగరంలోని తాజ్ గేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో కామినేని సీవోవో డాక్టర్ వెనిగళ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రఖ్యాత లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ రేలా సహకారంతో తమ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. దాదాపు నాలుగు వేల మందికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సనందించిన ప్రొఫెసర్ డాక్టర్ రేలా 28 ఏళ్ల పాటు లండన్ కింగ్స్ కాలేజీలో సేవలందించారని, పదేళ్ల క్రితం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన ఏడాది క్రితం చెన్నైలో డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ ను స్థాపించారని తెలిపారు. డాక్టర్ రేలా భాగస్వామ్యంతో నవ్యాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ వైద్య బృందం ప్రతి నెలా నాల్గవ శనివారం కామినేనిలో ఓపీ సేవలు అందిస్తారని డాక్టర్ నవీన్ కుమార్ ప్రకటించారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నందిగం వేణు మాట్లాడుతూ డాక్టర్ రేలా సహకారంతో కామినేనిలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషదాయకమన్నారు. డాక్టర్ రేలా నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం కామినేని లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం ద్వారా సేవలందించడం ఈ ప్రాంతవాసులకు ఓ మహత్తర అవకాశమని డాక్టర్ వేణు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ మహ్మద్ రేలా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ రంగంలో తన అనుభవాలను ఆయన వైద్యులతో పంచుకున్నారు. సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ వేలాది మందికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలను అందించగలిగామని డాక్టర్ రేలా అన్నారు. కార్యక్రమంలో రేలా ఇనిస్టిట్యూట్ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఇలన్ కుమరన్, డాక్టర్ రామ్‌కిరణ్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సేవలు