ఎంపీగా శివప్రసాద్‌ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం - నక్కా ఆనందబాబు

ప్రజల హృదయాల్లో శివప్రసాద్‌ది చెరగని స్థానం

- సినీరంగంలో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గొప్పవ్యక్తి.

- సమైక్యాంధ్ర ఉద్యమ వేళ, ప్రత్యేకహోదా ఉద్యమ సమయాన ఎంపీగా శివప్రసాద్‌ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం - నక్కా ఆనందబాబు.

చిత్రసీమలో, వైద్యరంగంలో, రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వ్యక్తి శివప్రసాద్‌ అని, తెలుగుదేశం పార్టీ నేతగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించిన గొప్పనాయకు డని తెలుగుదేశం నేతలు కొనియాడారు. శనివారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో     టీడీపీ సీనియర్‌నేత, దివంగత ఎన్‌.శివప్రసాద్‌ సంస్మరణ సభ నిర్వహించారు. సభలో  పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, విభజనానంతరం ప్రత్యేకహోదా కోసం పోరాడేక్రమంలో పలువేషధారణల్లో శివప్రసాద్‌ చేసిన నిరసనప్రదర్శనలు ప్రజల్ని అమితంగా ఆకట్టుకున్నాయన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చూపిన తెగువ, పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  ఎమ్మెల్సీ ఏఎస్‌.రామకృష్ణ మాట్లాడుతూ చిత్తూరు గడ్డపై పుట్టి, చరిత్రలో నిలిచిన మహనీయుల్లో శివప్రసాద్‌ ఒకరన్నారు. ఆయన మరణం తెలుగుదేశం శ్రేణుల్ని దు:ఖసాగరంలో ముంచేసిందని  సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో, ప్రత్యేకహోదా కోసం ఎంపీగా ఆయనచేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయక ంగా నిలుస్తుందని రామకృష్ణ కొనియాడారు. సభలో పాల్గొన్న నేతలు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. శివప్రసాద్‌ మృతికి సంతాపం తెలియచేసిన వారిలో టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర, మన్నెం శివనాగమల్లేశ్వరరావు (తెలుగుయువత), సత్యవాణి (తెలుగుమహిళ), సుభాష్‌చంద్రబోస్‌ (తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్రఅధ్యక్షులు), కనపర్తి శ్రీనివాసరావు, రావిపాటి సాయికృష్ణ, చుక్కపల్లి రమేశ్‌, గోళ్ల ప్రభాకర్‌ (మాజీ కార్పొరేటర్‌) బొద్దులూరి వెంకటేశ్వరరావు, బత్తుల శేషుబాబు ఉన్నారు.

--
 
తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయము,
గుంటూరు