రేపు శ్రీకాకుళంలో జగన్‌ పర్యటన

రేపు శ్రీకాకుళంలో జగన్‌ పర్యటన
పలాసలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు పలాస చేరుకొంటారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు నిర్మించదలచిన 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రయోగాత్మకంగా తలపెట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పథకాన్ని అక్కడే సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎచ్చెర్ల చేరుకొని ట్రిపుల్‌ ఐటీలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాకులను ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సింగుపురం వద్ద నిర్మించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను జగన్‌ ప్రారంభిస్తారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image