కిలో ఉల్లి రూ25కి అందించనున్న ఏపీ ప్రభుత్వం

కిలో ఉల్లి రూ25కి అందించనున్న ఏపీ ప్రభుత్వం
అమరావతి: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లి రేటు కన్నీళ్లు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా కిలో ఉల్లిని రూ25రూ అందించేందుకు సిద్దమవుతుంది.  మహారాష్ట్ర నుండి మూడువందల టన్నుల ఉల్లిని కిలో రూ30 చొప్పున కొనుగోలుచేశామని, రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.