ఎక్కడా కుల, మతపరమైన దూషణలు చేయలేదు; నన్నపనేని

 


--
 
 తేది. 12-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


నా రాజకీయ, వృత్తిగత జీవితంలో ఏనాడూ, ఎక్కడా కుల, మతపరమైన దూషణలు చేయలేదు


- మహిళా ఎస్సైని దూషించాననడం అవాస్తవం. ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేసిన వారిపై పరువునష్టం కేసులు వేస్తా.


- శ్రీమతి నన్నపనేని రాజకుమారి


రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నంతకాలం, రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి యోగక్షేమాల గురించే ఆలోచించానని, ఎక్కడ ఏ ఆడబిడ్డకు కష్టమొచ్చిందని తెలిసినా పరుగున వెళ్లి సహాయ సహకారాలందించిన సందర్భాలు అనేకం ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. గురువారం ఆమె మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితతో కలిసి గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 3 ఏళ్ల 7నెలలపాటు మహిళా కమిషన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో పేద, మధ్యతరగతి మహిళల ఆనందం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో  పనిచేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా, తెలుగుదేశం పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమానుష చర్యలకు పాల్పడిందన్న ఆమె, తనను అరెస్ట్‌ చేసి మూడు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారన్నారు. తనతో పాటు మరికొందరు మహిళా నేతలను అరెస్ట్‌ చేసే క్రమంలో పోలీసులు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని, ఒక పాత వాహనాన్ని తీసుకొచ్చి బలవంతంగా దానిలోకి ఎక్కించే ప్రయత్నం చేశారని రాజకుమారి చెప్పారు. ఆ వాహనం దుమ్ము, ధూళితో ఉన్నందున ఆ సమయంలో తమతో ఉన్న మహిళా నేత ఈ వాహనంలోని పరిస్థితిని వివరిస్తూ ''ఏంటమ్మా ఈ బండి ఇలా ఉంది... దరిద్రంగా..'' అని వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఆ వాహనం వెనుకనే ఉన్న మహిళా ఎస్సై ఎవరిని దరిద్రం అంటున్నారంటూ, మాపై కోపం ప్రదర్శిస్తూ, అసందర్భ వ్యాఖ్యానంతో, పరుష పదజాలం వాడిందని నన్నపనేని వివరించారు. పోలీస్‌జీప్‌లో ఉన్న మేమందరం, మా మానాన మేము ఏదో మాట్లాడుకుంటుంటే, ఆ మాటలను తనకు ఆపాదించుకొని సదరు మహిళా ఎస్సై ఎందుకలా వ్యవహరించిందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని రాజకుమారి వాపోయారు. ఆమె మాట్లాడుతుండగానే మేము ఉన్న వాహనం ముందుకు వెళ్లిపోయిందని,  చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాకగానీ మహిళాఎస్సైని రాజకుమారి, ఇతర టీడీపీ మహిళానేతలు దూషించారంటూ, మాపై  ప్రసారమాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని గమనించలేకపోయా మన్నారు. 23ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చిన తాను, ఆనాటి నుంచి వివిధ సేవాసంఘాల్లో పనిచేస్తూ ప్రజలకు, మహిళలకు సామాజికసేవ చేశానే తప్ప, ఎవరినీ ఎప్పుడూ ఎక్కడా దూషించడం, దుర్భాషలాడటం జరగలేదని రాజకుమారి గద్గదస్వరంతో తెలిపారు. గుర్రం జాషువా గారి కుమార్తె హేమలతా లవణం గారి స్ఫూర్తితో సాదాసీదాగా, ఏ విధమైన ఆభరణాలు, అలంకారాలు లేకుండా జీవించడం నేర్చుకున్నట్లు నన్నపనేని చెప్పారు. తన రాజకీయ, వృత్తిగత జీవితంలో , తన ఎదుగుదలకు, తనలోని సామాజికవికాసానికి ఎంతోమంది బడుగు, బలహీన వర్గాల వారే స్ఫూర్తి నింపారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న జరిగిన సంఘటనలో ఎక్కడా, తాను మహిళా ఎస్సైని ఉద్దేశించి కులం పేరుతో దూషించలేదని, అసలు ఇన్నేళ్ల తన రాజకీయ , వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ, ఎక్కడా కూడా అలాంటి దురంతాలు జరిగిన దాఖలాలు లేవని శ్రీమతి రాజకుమారి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సరైన సహాకారం అందించడం లేదని, తాను తన పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. తాను నోరుపారేసుకున్నానని, మహిళా ఎస్సైని కులం పేరుతో దూషించానని చెబుతున్న వారందరూ తగిన ఆధారాలుంటే  చూపాలని, అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తే సదరు వ్యక్తులు, సంస్థలపై పరువునష్టం దావా వేస్తానని నన్నపనేని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన కార్యక్రమం విజయవంతమవడంతో ఏం చేయాలో పాలుపోని కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు కావాలనే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితాన్ని వివాదాల్లోకి లాగేలా ఏ మీడియా సంస్థలు తనపై ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తిచేశారు.


ఎస్సై ఎందుకలా ప్రవర్తించిందో ఆమెకే తెలియాలి... మాజీ ఎమ్మెల్యే అనిత


   తనను అరెస్ట్‌ చేసిన అరగంట తర్వాత రాజకుమారి గారిని, ఇతర మహిళా నేతలను అరెస్ట్‌ చేసి ముందు మంగళగిరి స్టేషన్‌కు తరలించారని, అదే వాహనంలో మాతోపాటు మాజీ మంత్రివర్యులు జవహర్‌గారు కూడా ఉన్నారని, తామందరం దాదాపు అరగంటకు పైగా మంగళగిరి పీఎస్‌లోనే ఉన్నామని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి వంగలపూడి అనిత తెలిపారు. నిజంగా శ్రీమతి రాజకుమారి గారు ఆ ఎస్సైని కులం పేరుతో దూషించి ఉంటే, వాహనంలోఉన్న మమ్మల్నందరినీ అంత మర్యాదగా మంగళగిరి స్టేషన్‌కు ఎందుకు తరలిస్తారని శ్రీమతి అనిత ప్రశ్నించారు. సదరు మహిళా ఎస్సై ఏ సందర్భంలో, ఎందులా ప్రవర్తించిందో ఆమెకే తెలియాలన్నారు.      


 


 
 


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image