సమాజాన్ని తప్పుదోవపట్టించేవిధంగా ప్రవర్తించడం సరికాదు


తాడేపల్లి
      అమరావతి     సెప్టెంబర్‌ 26 ( అంతిమ తీర్ప) :.    మాజి ఎంఎల్ ఏ ఆమంచి కృష్ణమోహన్ ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ 
–చంద్రబాబు దిగజారిప్రవర్తిస్తూ సమాజాన్ని తప్పుదోవపట్టించేవిధంగా ప్రవర్తించడం సరికాదు.
–నాగార్జున రెడ్డి జర్నలిస్ట్‌ కాదు.ఇటీవల ఎన్నికలలో టిడిపి ఏజంట్‌ గా ఉన్నాడు.
–కరణం బలరామ్‌ కు కూడా అత్యంత సన్నిహితుడిగా మారి టిడిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.
–కౌంటింగ్‌ ఏజంట్‌ గా ఉన్నప్పటికి చంద్రబాబు, నాగార్జునరెడ్డి మా వాడు అని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అతనిపై 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.మహిళలను వేధించిన కేసులు కూడా వాటిలో ఉన్నాయి.
–భార్యను వేధించడం.రేప్‌ కేసు ఇతర కేసులు వాటిలో చంద్రబాబు సిఎంగా ఉన్న హయాంలో నమోదైనవి కూడా ఉన్నాయి.
–నాగార్జున రెడ్డి మహిళా అధికారిపై రాసిన భాష చూస్తే జర్నలిస్ట్‌ అంటారా?
–అంగపూజ చేస్తున్నారంటూ మహిళా అధికారి గురించి అభ్యంతరకరంగా రాశారు.
–అతను రాసిన వార్తల ఆధారాలు మీకు చూపుతాను.ఇది జర్నలిజం అంటారా?మీరు చెప్పండి.
–ఛాన్‌ భాషా  29 సంవత్సరాల యవ అధికారి అతనిని అభ్యంతరకరంగా భాష ఉపయోగిస్తూ వార్తలు రాశాడు.
–అరే కృష్ణమోహన్‌ గూట్లే...నేను రేప్‌ చేస్తే ఆమంచి కృష్ణమోహన్‌ చూడాలనుకుంటున్నాడు.వారి కుటుంబంలో నేను ఎవర్ని రేప్‌ చేశాను.
–ఎధవ....అని ఐఏఎస్‌ ని మహిళా అధికారిని గురించి అంగపూజ అంటూ భాష ఉపయోగించాడు.
–ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఐవి సుబ్బారావు అనే వ్యక్తి అతని గురించి ఏం పోస్టులు పెట్టారో అడగండి చెబుతారు.
–నేను ప్రస్తావించిన అంశాలన్ని కూడా 17 కేసులలో ఉన్నాయి.
–మా ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాబట్టి నాకు ఆపాదించారంటే అర్దం ఉంటుంది.నిజానిజాలు పోలీసులు తేలుస్తారు.
–శ్రీవైయస్‌ జగన్‌ గారిలాంటి 151 స్దానాలలో గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి
–రాష్ట్రంలో అద్బుతమైన పాలన కొనసాగుతోంది.నేను పదిరోజులక్రితం రెండో బ్లాక్‌ వద్ద ఉంటే పులివెందులకు సంబంధించిన కార్యకర్తలు నన్ను కలిసారు.మా జగన్‌ ఏంటి కేజ్రీవాల్‌ లా వెళ్తున్నారు.అని నన్ను అడిగారు 
–శ్రీవైయస్‌ జగన్‌ గారు రాష్ట్రంలో చేస్తోంది పవిత్ర యజ్ఞం.
–ప్రతి విషయాన్ని కూడా సిఎంకు ఆపాదించడం సరికాదు.
–వైయస్‌ జగన్‌ నీతినిజాయితీ ముందు చంద్రబాబు సరిపోడు.
–చంద్రబాబు ఆధ్వర్యంలో వంగవీటి రంగా హత్య జరిగితే  వేయి కోట్ల మేర ఆస్దులు ధ్వంసం అయ్యాయి.
–ఆ కేసులో ఒక చిన్నవ్యక్తికి కూడా శిక్ష పడకుండా చేసిన వ్యక్తివి నీవు.
–మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెరుకులపాడు  నారాయణరెడ్డిని ఏ విధంగా చంపారో ప్రజలకు తెలుసు.అది అరాచకం అంటే.దానికి ప్రజలు కూడా చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు.
–పద్మ అనే అమ్మాయికి నర్సమ్మకు ఇంట్లో చదివింపుకు సంబంధించి వివాదం నేపధ్యంలో ఆత్మహత్య చేసుకుంది.
–గతంలో 13 కేసులు పెట్టింది.కుమారుడుపై రేప్‌ కేసు పెట్టింది.మా ఫ్యాక్టరీలో పనిచేసింది.అయితే ఆత్మహత్యను కూడా రాజకీయహత్య అంటూ  సిగ్గులేకుండా చంద్రబాబు వచ్చి పరామర్శించాడు.
–కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకుంటే అంతిమయాత్రలో పాల్గొని చంద్రబాబు విక్టరీ సింబల్‌  రెండువేళ్లు చూపించాడు.అది ఎంత దారుణం.
–కోడెల మృతదేహంముందు సంతోషంతో ఉన్నట్లు తెలుగురాష్ట్రాలలో ప్రచారం జరిగింది.
–శ్రీ వైయస్‌ జగన్‌ నీతినిజాయితీ ముందు చంద్రబాబు సరిపోడు.చాలామంది టిడిపిని వదిలివేసి క్యూలో నిల్చున్నారు.వెళ్లిపోవడానికి సిధ్దంగా ఉన్నారు.
–నాగార్జునరెడ్డిపై దాడి కేసులో దాడిజరిగిన 12 గంటలలోనే ఆరుగురుని అరెస్ట్‌ చేశారు.వెహికల్‌ ను కూడా సీజ్‌ చేశారు.
–అదే చంద్రబాబు హయాంలో  మంత్రి పత్తిపాటి పుల్లారావు ,ఆయన వర్గీయుల చేతిలో శంకరయ్య అనే ఆంధ్రప్రభ రిపోర్టర్‌ ను చంపితే ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు.
–నాగార్జునరెడ్డిపై దాడిని మేం కూడా ఖండిస్తున్నాను.వాటిని సమర్దించేవాళ్లం కాదు.దాడివేరు.జర్నలిజానికి çఆపాదించడం సరికాదు.
–గత మూడు రోజులుగా నాగార్జున రెడ్డికి ఎవరూ కూడా మధ్దతు తెలియచేయలేదు.
–చంద్రబాబు రాజకీయంగా చచ్చిపోయాడనే ఆనందంలో ప్రజలు ఉన్నారు.భవిష్యత్తులో కూడా అదే భావనలో ఉంటారు.నీపై సానుభూతి లేదు.
–అక్రమకట్టడంలో నివాసం ఉంటూ రివర్‌ కన్సర్వేటివ్‌ యాక్ట్‌ గురించి నీకు తెలియదా?