ఉత్చాహంగా దాండియా మెగా ఈవెంట్ 

ఉత్చాహంగా దాండియా మెగా ఈవెంట్ 
హాజరైన మహిళా గవర్నర్ సుప్రవ హరి చందన్  
డీజిపి గౌతమ్ సవాంగ్


విజయవాడ: దాండియా వేడుకతో  నగరం పులకించింది.  లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో  గార్బా, దాండియా 2019 మెగా ఈవెంట్ కు విశేష స్పందన లభించింది. క్రియేటివ్ సోల్ నేతృత్వంలో గత 21 రోజులుగా శిక్షణ పొందిన  యువతీ యువకులు,  చిన్నారులు, పెద్దలు  ఆడిపాడారు.  కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్, వీనుల విందైన సంగీతం నడుమ ఆడి, పాడిన బృందాలు విలువైన బహుమతులు  గెలుపొందారు.  ఈ గార్భా, దాండియా నృత్యరీతుల ప్రదర్శనకు గత రెండు సంవత్సరాలుగా మంచి స్పందన లభిస్తుండగా, ఈ సంవత్సరం అది రెట్టింపు అయ్యింది.   శనివారం నాటి క్రియేటివ్ సోల్  కల్చరల్ సొసైటీ మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అదరహో అనిపించాయు.   మెగా ఈవెంట్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన నిర్వాహకులు సుమన్ మీనా, నేహా జైన్ మాట్లాడుతూ  గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతుల ప్రదర్శనను సైతం నగరవాసులు ఆదరించారని తెలిపారు. . 
సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను  ఆంధ్రప్రదేశ్ కు  పరిచయం చేసే క్రమంలో తాము మెగా ఈవెంట్ కు రూపకల్పన చేశామని ఈ సందర్భంగా తెలిపారు. కళలతో దేశసమైఖ్యతను చాటేలా  గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు. ఇందుకోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కలిగిన శిక్షకులను రప్పించామని సుమన్ మీనా తెలిపారు. ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు రూ.లక్షకు పైబడిన బహుమతులు అందించారు.  దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని నిర్వాహకులు వివరించారు. కార్యక్రమ ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్  వ్యవహరించిది.


 రాష్ట్ర  ప్రథమ మహిళ సప్రవ హరి చందన్ జూనియర్స్ విభాగంలో విజేతలకు బహుమతులు అందజేశారు. డిజిపి గౌతమ్ సవాంగ్ దంపతులతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ముఖేష్ కుమార్ మీనా, సిద్దార్థ జైన్, శశీ భూషణ్ కుమార్, హిమాన్షు శుక్లా, కృతిక శుక్లా, సుజాత శర్మ, ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ భూపాల్ రెడ్డి,  కృష్ణ సంయుక్త కలెక్టర్ మాధవి లత, పలువురు ఐఏఎస్ అధికారుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.