మహాకవి జాషువా జయంతి   వారోత్సవాలు

    గుంటూరు సెప్టెంబర్ 22:     శాసన మండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్  ఆధ్వర్యంలో నిర్వహించ బడుచున్న మహాకవి జాషువా జయంతి   వారోత్సవాలు లో బాగంగా ఈ రోజు 22.09.2019 సాయంత్రం 6.00 గంటలకు గుంటూరు పట్టణంలో బృందావన్ గార్డెన్స్ నందలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో అన్నమయ్య కళా వేదిక నందు " జాషువా పద్యానికి పట్టాభిషేకం" కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు  ముఖ్యఅతిథిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం  మరియు మాజీ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ఆత్మీయ అతిథులు గా పాల్గొంటారు.