పోరాటం చేసి సాధించుకున్న ప్రాజెక్టును నిర్లక్షం చేస్తున్నారు - నిమ్మల

--
       తేదీ: 23.09.2019


 


టీడీపీపై కక్షతో ప్రాజెక్టు భద్రతను పణంగా పెడుతున్నారు


పోరాటం చేసి సాధించుకున్న ప్రాజెక్టును నిర్లక్షం చేస్తున్నారు


- నిమ్మల రామానాయుడు


. ముఖ్యమంత్రి జగన్‌ కేవలం టీడీపీపై బురద చల్లేందుకు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు భధ్రతను పణంగా పెట్టి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విభజన సమయంలో తెలుగు ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న జాతీయ ప్రాజెక్టు పోలవరంను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. 'వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది రివర్స్‌ టెండరింగ్‌ కాదు... రిజర్వుడ్‌ టెండరింగ్‌. ఐదేళ్లలో 63శాతానికి పైగా పనులు పూర్తి చేసిన కంపెనీని కాదని 10 ఏళ్లలో 7శాతం పనులు మాత్రమే చేసిన కంపెనీకి కాంట్రాక్టు అప్పగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టును మరో ధన యజ్ఞం చేయదలిచారా.? పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ తరచుగా కాంట్ట్రాక్టు ఏజెన్సీలను మార్చుకుంటూ పోతే '' ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఇప్పటికే మూడు నెలలు ప్రాజెక్టు నిలిపివేసి ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్ని విషయాలను తమకు తెలియజేసే చేపట్టారని పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ విస్పష్టంగా చెప్పిన  తరువాత వారి అనుమతి తీసుకోకుండా రీ టెండర్లు పిలవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు?  ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని పీపీఏ వేసిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా?


సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఉత్తర్వులు ప్రకారం ఏ పనులనైనా అప్పగించడానికి ''సాంకేతిక అర ్హతలు ఉన్న సంస్థలను మొదటిగా షార్ట్‌ లిస్ట్‌ చేసి'', తరువాత మాత్రమే ''ధర నిర్థారణ'' గురించి నిర్ణయాలు మొదలు పెట్టాలని స్పష్టంగా చెప్పనప్పటికీ జీవో నెం.67 లో మీరు ఇచ్చిన ''రివర్స్‌ టెండరింగ్‌'' విధి విధానాలు దీనికి పూర్తి విరుద్దంగా ఉన్నాయి.. మీరు ముందే నిర్ణయించుకున్న సంస్థలకు అనుకూలంగా నిబంధనలను రూపొందించారు. అనుభవం, సాంకేతిక అర ్హత లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును అప్పగించడం అనేది ప్రాజెక్టు భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. కేవలం టీడీపీపై బురద జల్లాలనే ఉద్దేశంతో ప్రాజెక్టును పణంగా పెట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏం చేయలచుకున్నారు?


 


ఐఖి/-


    నిమ్మల రామానాయుడు


       పాలకొల్లు శాసనసభ్యులు


  
 
 


 
 
తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయము,
గుంటూరు