కొత్త ఇండ్ల కు సర్వే

ఈ రోజు సోమవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రూరల్ తహసీల్దార్ మరియు అర్బన్ తహసీల్దార్ పరిధిలోని యానాదులు (గిరిజన )తమ యొక్క సమస్యలు, ఇండ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, పింఛన్లు కొరకు నెల్లూరు జిల్లా యానాదులు సంక్షేమ సంగం ఆధ్వర్యంలో   పలు గిరిజన కాలనీలోని సమస్యలు నెల్లూరు రూరల్ మరియు అర్బన్ తహసీల్దార్ లకు మన మహిళలు ద్వారా అర్జీలు ఇప్పించడమైనది. దీనికి అధికారులు స్పందించి దొరతోపు కాలనీలో 3, 4, డివిజన్ లో వీఆరోఓ, ఆరై, గార్లు కొత్త ఇండ్ల కు సర్వే చేయడం జరిగింది. మిగతా సమస్యలు ప్రజా స్పందన ద్వారానే మీకు న్యాయం చేకూర్చతామని అధికారులు తెలియ చేయడమైనది. ఈ కార్యక్రమంలో యానాదులు సంక్షేమ సంగం జిల్లా ప్రధానకార్యదర్శి, తలపల. చంద్రమౌళి, వర్కింగ్ ప్రెసిడెంట్ B. L. శేఖర్, జాయింట్ సెక్రటరీ ఇండ్ల. రవి, నాయుకులు కత్తి. మస్తానయ్య, ఏకోళ్ళు. సుబ్రహ్మణ్యం, మహిళలు ఏకోళ్ళు. లక్ష్మి, B. పద్మ, యూత్ నాయకురాలు సత్తివేటి. లక్ష్మి, మరి కొంతమంది మహిళలు పాల్గొన్నారు.