జనరంజక పాలనతో దూసుకుపోతున్న ఆంద్రప్రదేశ్ సీఎం


తేది : 06-09-2019
అమరావతి


100 రోజుల పాలనలో 100కు పైగా నిర్ణయాలు – పాలనకు నూటికి నూరు మార్కులు


•  విప్లవాత్మక నిర్ణయాలతో, జనరంజక పాలనతో దూసుకుపోతున్న సీఎం


•  రాజన్న రాజ్యం దిశగా అడుగులు - సామాజిక విప్లవానికి సరికొత్త మార్పులు


•  రైతు పక్షపాతి ప్రభుత్వం మాది – రైతుకు ఎంత చేసినా తక్కువే - రైతును ఆదుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తాం – అదే ముఖ్యమంత్రి ఆశయం


•  రైతులకు ఏదీ అవసరమో అధ్యయనం చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటాం


•  రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిరుధాన్యాలను ప్రోత్సహించాలని నిర్ణయం


•  కొబ్బరికి సంబంధించి నియోజకవర్గానికొక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు


•  100 రోజుల్లోనే 4 లక్షల ఉద్యోగాలకి నిర్ణయం – భర్తీ దిశలో ప్రభుత్వం అడుగులు


•  రాష్ట్రంలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే సహించే ప్రసక్తే లేదు


•  ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం -సవ్యసాచిలా వారిపై మా పోరాటం


•  సంస్కరణ, సంక్షేమం, తప్పుల దిద్దుబాటు, అవినీతిపై ఉక్కుపాదం - ఇదే మా ప్రభుత్వ అభిమతం: వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు


వెలగపూడి, సెప్టెంబర్ 6 :  కేవలం వంద రోజుల్లోనే వందకు పైగా కీలక నిర్ణయాలు తీసుకుని 'ఇది అందరి ప్రభుత్వం' అని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. శుక్రవారం వెలగపూడి సెక్రటేరియట్ లోని ప్రచార విభాగంలో విలేఖర్లతో మాట్లాడుతూ, గత పాలకుల తీరుకు భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలన ఉందన్నారు. ఐదు కోట్ల ప్రజలకు కళ్లకు కట్టినట్లు పరిపాలన దక్షతను తమ ప్రభుత్వం చూపించారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షాపాతిగా ఉంటూ తొలి రోజు నుంచే రైతుల క్షేమం కోసం అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఇందుకు నిదర్శనంగానే అమలు చేసిన పలు పథకాలు, చట్టాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. సాక్షాత్తు బడ్జెట్ లోనే వ్యవసాయం అనుబంధ రంగాలపై 12.36 శాతం నిధులను కేటాయించడమే ఇందుకొక ఉదాహరణని మంత్రి తెలిపారు. 


వ్యవసాయశాఖ మంత్రిగా రైతులకు ప్రభుత్వం చేసిన కొన్ని పథకాలను మీడియా, ప్రజలతో పంచుకుంటున్నానని ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తొలుత పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, తాను కూడా మీలో ఒకడిగా ఉండటం సంతోషకరమన్నారు. వందరోజులు ప్రభుత్వంలో వ్యవసాయశాఖలో తెచ్చిన మార్పులు ఆహ్వానించదగ్గవే కాకుండా ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు, వ్యవసాయం సంక్షోభంలో ఉందన్న విషయం గుర్తు చేస్తూనే  తమ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండే రైతులకు పదుల సంఖ్యలో పథకాలు అమలు చేసుకుంటూ వారికి భరోసానిచ్చామన్నారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి వైఎస్ ఆర్ రైతుభరోసా అమలు చేస్తామని హమీ ఇచ్చారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకమైన కిసాన్ సమ్మాన్ యోజనతో రైతు భరోసా పథకాన్ని అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరే అవకాశం ఉందన్నారు.  రాష్ట్రంలో 48  లక్షల 70 వేల రైతు కుటుంబాలు, 38 లక్షల కౌలు రైతులు ఉన్నారని గుర్తు చేశారు. పదకొండు నెలలపాటు భూ యాజమాన్య హక్కులు దెబ్బతినకుండా కౌలు రైతులు హక్కులను కాపాడుతున్నామన్నారు.  ఇప్పటికే వైఎస్ఆర్ వడ్డీలేని పంట బుణాన్ని ప్రకటించామన్నారు. బీమాను రైతులు పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. బుణాలు తీసుకోని రైతులు కూడా ఇందులో ఉంటారన్నారు.  ఉద్యానవన పంటలను కూడా ఇన్సురెన్స్ పరిధిలోకి తెచ్చేందుకు గాను సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image