అకాల వర్షాలకు నష్టపడ్డ పంటలను పరిశీలించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు

అకాల వర్షాలకు నష్టపడ్డ పంటలను పరిశీలించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు


దువ్వూరు:


అకాల వర్షాలు కారణంగా దెబ్బతిన్న పంటలను బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బిజెపి బృందం పరిశీలించింది.   దువ్వూరు మండలం,నెలటూరు, పెద్ద జొన్నవారం,గ్రామాల్లో పంటలు నష్టం  జరిగిన ప్రాంతాల్లో పర్యటించి రైతులు,గ్రామస్తులు తో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాడడం జరిగింది..


ఈ సందర్భంగా రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అధికారులు చొరవచుపలేదు,నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని బి.జె.పి  డిమాండ్ చేస్తుందని,అలాగే టంగుటూరు బ్రిడ్జ్ ను వెంటనే పునరుద్ధరణ చేపట్టి గ్రామస్తులకు రవాణా సౌకర్యం ఏర్పాట్లు చెయ్యాలని, ప్రతి10 సంవత్సరంలకు ఒక్కసారి రైతులు ఈ ప్రాంతంలో ఎక్కువగా వరద పొటుకు గురి అయ్యి పంటపొలాలలో మిటలు వేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, చనిపోయిన వారికి ఎక్సగ్రెసియా 20 లక్షలు ఇవ్వాలని,కనీసం ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు చనిపోయారని అన్నారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాజగోపాల్ రెడ్డి, దాడిగుంట రగునాథరెడ్డి,కిషన్మోర్చా రాష్ట్ర నాయకులు రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..