తపాల శాఖ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి .
నెల్లూరు : (అంతిమ తీర్పు ప్రతినిధి): .అఖిల భారత తపాల SC/ST ఉద్యోగుల సంక్షేమ సంఘం నెల్లూరు డివిజన్ కార్యవర్గ సమావేశం స్టోన్ హౌస్ పేట తపాల కార్యాలయంలో ని అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు దుడ్డు రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ఇటీవల వచ్చిన తపాల శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగుల హక్కులను హరించి వేస్తున్నారని, కనీస సెలవులు కూడా సకాలంలో ఇవ్వకుండా ఉద్యోగులను మానసిక్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జనాభా పెరుగుదలకు అను గుణంగా తపాల కార్యాలయములు కొత్తవి ఏర్పాటు చేయడానికి బదులు ఉన్న పోస్టాఫీసు లను ఎత్తి వేస్తున్నారని అని దీనివలన ప్రజలు ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు .GDS ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉన్నాయని జీతాలు పెంచాలని కోరితే జీతాలలో కోత విధిస్తున్నారని తెలిపారు .ఇంకా అనేక విధాలుగా అధికారులు ఉద్యోగుల ను వేధిస్తున్నారని తెలియ చేశారు. ఈ సందర్భంగా
కార్యదర్శి డి .ఆనంద్ మాట్లాడుతూ తపాల శాఖ లో సమస్యల పరిస్కారానికి AIPSCSTEWA,,, AIGDSU (JCA)సంయుక్తంగా ధర్నా కార్యక్రమం పోస్టల్ సూపరణింటెండెంట్ కార్యాలయం నెల్లూరు నందు ఈనెల 30వ తేదీ నుండి నిర్వహించేందుకు నిర్ణయించారని తెలియపరచారు.AIGDSU నెల్లూరు డివిజన్ కార్యదర్శి MD ఇస్మాయిల్ మాట్లాడుతూ GDS ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకుండా ఉద్యోగుల ను తీవ్రంగా వేధిస్తున్నారని 30వతేది జరగబోవు ధర్నాకు ప్రతి ఒక్కరు మద్ధతు ఇవ్వాలని తెలియ చేశారు.ఈకార్యక్రమంలో AIPSCSTEWA ఉపాధ్యక్షుడు భాస్కరరావు,కోశాధికారి P. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.