ఐ టి డి ఎ కార్యాలయ పీఓగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. జిల్లా యానాదుల సంక్షేమ సంఘం .
నెల్లూరు సెప్టెంబర్ 27 (అంతిమ తీర్పు ప్రతినిధి) :. జిల్లాలోని ఐ.టి.డి.ఎ కార్యాలయ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారిని నియమించాలని జిల్లా యానాదుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐ టి డి ఎ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో 8లక్షలకుపైగా ఉన్న యానాదులకు న్యాయం జరగా లంటే ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నియమించాలని గా డిమాండ్ చేశారు.
అక్టోబర్ 15వ తేదీలోపు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఐ టి డి ఎ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని తెలియజేయ జేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, నెల్లూరుజిల్లా అధ్యక్షులు శ్రీమంతుల మురళీ, ప్రధాన కార్యదర్శి తలపల చంద్రమౌళి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి ఎల్ శేఖర్, కోశాధికారి ఇండ్ల మల్లి, గూడూరు డివిజన్ అధ్యక్షులు తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఏకొల్లు సుధాకర్, ఏలూరు చెంచురామయ్య, లక్ష్మి, యశోధ, మేకల పద్మ, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
ఐ టి డి ఎ కార్యాలయ పీఓగా ఐఏఎస్ అధికారిని నియమించాలి.