సెప్టెంబరు 5 నుండి 19వ తేదీ వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

                        తిరుపతి, 2019 సెప్టెంబరు 01


సెప్టెంబరు 5 నుండి 19వ తేదీ వరకు


శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు


టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 5 నుండి 19వ తేదీ వరకు


శ్రీకాకుళం జిల్లాలో 7  ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలో 7 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. ఆయా ప్రాంతాలలో సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.


శ్రీకాకుళం జిల్లా:


- సెప్టెంబరు 5వ తేదీన సోంపేట మండలం, పొట్రఖండ గ్రామంలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.


- సెప్టెంబరు 6న కంచిలి మండలం, గోకర్ణపురం గ్రామంలోని  శ్రీ సంతోషిమాత ఆలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.


- సెప్టెంబరు  7న నందిగం మండలం, కోటిపల్లి గ్రామంలోని సీతారామాలయంలో  శ్రీవారి కల్యాణం జరుగనుంది.


- సెప్టెంబరు 8న నందిగం మండలం, రౌతుపురం గ్రామంలోని యస్‌.సి.కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.


- సెప్టెంబరు 9న సంతబొమ్మాలి మండలం, మత్య్సకార గ్రామం, సురదవనిపేటలో శివ రామాలయంలో  శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.


- సెప్టెంబరు 10న పోలాకి మండలం, బార్జిపాడు గ్రామంలోని యస్‌.సి.కాలని శ్రీ కోడురమ్మ ఆలయంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.


-  సెప్టెంబరు 11న టెక్కలి మండలం, చాకిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.


 


విజయనగరంజిల్లా:


- సెప్టెంబరు 13న కురుపాం మండలం, పోడి గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.


- సెప్టెంబరు 14న కురుపాం మండలం,  పట్టాయదొరవలస గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.


- సెప్టెంబరు 15న జియ్యమ్మవలస మండలం, చిలకలవేణివలస గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.


- సెప్టెంబరు 16న కొమరాడ మండలం, దంగభద్ర గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో  స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.


- సెప్టెంబరు 17న పర్వతీపురం మండలం, బి.గడబవలస గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.


- సెప్టెంబరు 18 సీతానగరం మండలం, సుభద్ర సీతారామాపురం గ్రామంలోని  ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.


- సెప్టెంబరు 19న మక్కువ మండలం, ఎమ్‌.పాలికవలస  గ్రామంలోని  ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.


      శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image