ఉల్లి ధరల పై అధికారులతో సమీక్షించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ..


                      
                        ---------------
               
                     --------------------
అమరావతి సెప్టెంబర్ 23 2019 :—
 
ఉల్లి ధరల పై అధికారులతో సమీక్షించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ.....
  
★ ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావటానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం.....


★ బుధ/గురు వారం నుండి  మహారాష్ట్ర నుండి ఉల్లిని తెప్పించి రైతు బజార్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


★ ఈమధ్య కాలంలో సంభవించిన వరదలు మరియు భారీ వర్షాల మూలంగా పంట దెబ్బతిందని, అందుచే ధరలు పెరిగాయని తెలిపారు.


★ అదేవిధంగా ఈ స్థితిని అనువుగా మార్చుకుని కొంతమంది కృత్రిమ కొరత కూడా సృష్టించినట్టు తమ దృష్టికి వచ్చిందని... అటువంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు  పశు
మత్స్య, మార్కెటింగ్ శాఖమంత్రి మోపిదేవి వెంకట రమణ రావు తెలిపారు.......


***