గుంటూరు సెప్టెంబర్ 27 (అంతిమ తీర్పు):
ఏ. బీ.ఎన్. ఆంధ్ర జ్యోతి, టీ.వి.5, ఛానళ్ళ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎం.ఎస్.ఓ.ల కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని విజయవాడ లో ఏ.పీ.యు. డబ్ల్యు.జే. ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. కార్యక్రమం లో తెలుగు దేశం అధ్యక్షుడు కే.కళా వెంకట్రావు, బీ.జే.పీ., అధికార ప్రతినిధి ఉమా మహేశ్వర రాజు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు గురునాధం, సి.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి కే. రామ కృష్ణ, సి.పీ.ఐ. ఎం. రాష్ట్ర నాయకుడు డీ.వి.కృష్ణ, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, ప్రసాద బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏ.వనజ, నగర కార్యదర్శి దొనేపూడి శంకర్, బెజ వాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్, విశాలాంధ్ర సంపాదకుడు ముత్యాల ప్రసాద్, ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు డీ.సోమ సుందర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, తదితరులు మాట్లాడారు. ఛానళ్ళ ప్రసారాల నిలిపివేత ను వక్తలు తీవ్రంగా ఖండించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బా రావు అధ్యక్షత వహించారు. ఏ.పీ.ఫైబర్ నెట్ లో ప్రసారాలను వెంటనే పునరుద్ధరించ డానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. యూనియన్ అర్బన్ శాఖ అధ్యక్షుడు చావా రవి స్వాగతం పలుకగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.జయ రాజు వందన సమర్పణ చేశారు.
ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎం.ఎస్.ఓ.ల కార్యాలయాల వద్ద నిరసనలు