చింతమనేనికి ఈ నెల 25 వరకూ రిమాండ్‌

చింతమనేనికి ఈ నెల 25 వరకూ రిమాండ్‌
 ఏలూరు : దళితులను దూషించి.. దౌర్జన్యం చేసిన కేసులో అరెస్ట్‌ అయిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు న్యాయస్థానం ఈ నెల 25 వరకూ రిమాండ్‌ విధించింది. అంతకు ముందు ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు అనంతరం చింతమనేనిని ఏలూరు ఎక్సైజ్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర‍్తి ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్‌ విధించారు. గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బుధవారం ఉదయం దుగ‍్గిరాలలోని తన నివాసానికి రావడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి పది కేసులు నమోదు చేశారు.