శనివారం నంద్యాల డివిజన్ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న జిల్లా ఇంఛార్జి మంత్రి :కలెక్టర్*

*శనివారం నంద్యాల డివిజన్ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న జిల్లా ఇంఛార్జి మంత్రి :కలెక్టర్*


      కర్నూలు  సెప్టెంబర్     20: నంద్యాల డివిజన్ లో వరద నష్టాన్ని, పంట నష్టాన్ని, వరద తీవ్రతను పరిశీలించి వరదబాధితులను పరామర్శించడానికోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి  బొత్స సత్యనారాయణ శనివారం (21-9-19) ఉదయం విజయవాడ నుండి నేరుగా మహానంది మండలం గాజులపల్లెకు ఉదయం 11 గంటలకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్ శుక్రవారం సాయంత్రం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.


గాజులపల్లె, మహానంది, తమ్మడపల్లె చెరువు, గోస్పాడు మండలం దీబగుంట్ల, సిరివేళ్ళ మండలం ఎర్రగుంట్ల ఎస్సీ కాలనీ, నంద్యాల శ్యామనగర్ ప్రాంతాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారని, పంట నష్టం పరిశీలన చేస్తారని అనంతరం నంద్యాలలో జిల్లా అధికారులతో వరద సహాయక చర్యలపై సమీక్ష చేస్తారని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వివరించారు.
--------------------------