సింహపురికి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌


ఇంటర్‌సీటి రైలు, రైలులో సెకండ్‌ క్లాస్‌ సీటింగ్‌
నెల్లూరు : దక్షిణ మధ్య, దక్షిణ రైల్వే జోన్ల ఎండ్‌ పాయింట్‌గా ఉన్న గూడూరు జంక్షన్‌ నుంచి రాజధాని అమరావతి విజయవాడకు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు నేటి నుంచి పట్టాలెక్కనుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చినా.. కొత్త రాజధాని అమరావతి కేంద్రమైన విజయవాడకు నెల్లూరు జిల్లా నుంచి పగటి పూట ప్రత్యేక రైలు లేకుండా పోయింది. ఇప్పటి వరకు విజయవాడకు వెళ్లాంటే చెన్నై, తిరుపతి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లే దిక్కుగా ఉన్నాయి. ఇవీన్ని కూడా ఎక్కువగా రాత్రి వేళలో నడుస్తున్నాయి. గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు సింహపురి సూపర్‌ఫాస్ట్‌ రైలు ఉన్నప్పటికీ ఇది కూడా రాత్రి వేళ ఉంది. గూడూరు– విజయవాడ మధ్య ఉదయం, మధ్యాహ్నం ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. అయితే  ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన  ఓటాన్‌ బడ్జెట్‌లో కానీ, ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌లో కానీ జిల్లా నుంచి విజయవాడకు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి రైల్వే ప్రాధాన్యతలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు, ఎంపీల డిమాండ్‌తో గూడూరు నుంచి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును అనూహ్యంగా ప్రకటించారు. ఎప్పటి నుంచో జిల్లా వాసులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి : గూడూరు– విజయవాడ మధ్య ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం గూడూరులో  ప్రారంభించనున్నారు. గత వారమే ఈ ట్రైన్‌ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. గూడూరు–విజయవాడ (రైలు నంబరు 12743) ఉదయం 6.10 గంటలకు గూడూరులో బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10.40 గంటలకు చేరుతుంది.  విజయవాడ–గూడూరు (రైలు నంబరు12744) విజయవాడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గూడూరుకు రాత్రి 10.30 గంటలకు చేరుతుంది. ఈ రైలు రెండు ఏసీ చైర్‌కార్‌లు, పది సెకండ్‌ చైర్‌కార్‌లు కోచ్‌లు ఉన్నాయి. 
8 చోట్ల స్టాపింగ్‌ : జిల్లా నుంచి వివిధ వ్యాపారాల నిమిత్తం వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు గూడూరు, నెల్లూరు, కావలి నుంచి విజయవాడ వరకు నిత్యం 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి కొన్ని ట్రైన్స్‌ అనువుగా ఉన్నా, కొన్ని చోట్ల నిలుపుదల లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆ రైళ్లు సుదూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో జిల్లా వాసులు వాటిలో ప్రయాణాలు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  దీంతో జిల్లా నుంచే ట్రైన్‌ విజయవాడకు మొదలు కానుండడంతో చాలా వరకు సౌకర్యం కలగనుంది. ప్రధానంగా గూడూరు నుంచి బయలుదేరే ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి రైల్వేస్టేషన్లల్లో నిలుపుదల, చివరగా విజయవాడలో ట్రైన్‌ ఆగుతుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా అవే స్టేషన్లలో ట్రైన్‌  నిలుపుదల చేయనున్నారు. 
రైలుకు పేరుపై కసరత్తు : గూడూరు–విజయవాడ మధ్య నూతనంగా ప్రారంభింనున్న ట్రైన్‌కు ఏ పేరు పెడతారన్న దానిపై కసరత్తు జరుగుతోంది. చాలా చోట్ల రైళ్లకు ఆయా ప్రాంతాల పేర్లు, లేక ఆధ్యాత్మిక కేంద్రాలతో వచ్చే పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు వేదగిరి ఎక్స్‌ప్రెస్, లేదా తల్పగిరి ఎక్స్‌ప్రెస్, లేదా షార్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్లు ప్రతిపాదనలపై ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరేదైనా పేరు పెడతారా వేచి చూడాల్సి ఉంది.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image