గుంటూరులో చంద్రబాబుతో భేటిలో టిడిపి నేతలు

గుంటూరులో చంద్రబాబుతో భేటిలో టిడిపి నేతలు
గుంటూరు:  పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం టిడిపి నేతలు భేటి అయ్యారు.
ఈ సందర్భంగా చర్చించిన అంశాలు: 
1).పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేశారు. రివర్స్ టెండర్ పేరుతో టెండర్ ను రిజర్వ్ చేశారు, డెవలప్ మెంట్ ను రివర్స్ చేశారు.
గత 4నెలల్లో వైసిపి ప్రభుత్వం చేతకానితనంతో సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ చేస్తోంది. 
రివర్స్ టెండర్ల వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి..? ప్రజలకు జరిగే నష్టం ఎంత..? అనేదాన్ని అధ్యయనం చేయకుండా మూర్ఖంగా వెళ్లి,  ప్రాజెక్టు భద్రతతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. 
పోలవరం ప్రాజెక్ట్ హైడల్ వర్క్స్, పవర్ హవుస్ పనులు రెండింటిని ఎందుకు కలిపారు..? సివిసి గైడ్ లైన్స్ ఎందుకు ఉల్లంఘించారు..? టెండర్లు రివర్స్ చేయడం కాదు, మొత్తం  డెవలప్ మెంట్ నే రివర్స్ చేశారు. 
ఆ రోజు ఇదే సంస్థ పోలవరం పనుల్లో టెండర్ ఎందుకు ఎక్కువకు వేసింది..? ఈరోజు తక్కువకు ఎలా వేసింది..?
అప్పుడు ఇదే సంస్థను చంద్రబాబు బినామీ సంస్థ అన్నారు, పట్టిసీమలో దానికి రూ.350కోట్లు దోచిపెట్టారని ఇదే మేఘనను ఆరోజు విమర్శించారు. ఇప్పుడా సంస్థకే ఎలా టెండర్ రిజర్వ్ చేశారు..? రాష్ట్రానికి 10రెట్లు నష్టం చేసి ఇంకా ఆదా చేశామని డబ్బా కొట్టుకుంటారా..? గతంలో పనిచేసిన సంస్థలకు నష్ట పరిహారం కింద ఎన్నివందల కోట్లు చెల్లిస్తారు..? 
ఇదే సంస్థ కాళేశ్వరం పనుల కాంట్రాక్ట్ కు ఎంతకు టెండర్ వేసింది..? జూరాల పవర్ హవుస్ కాంట్రాక్ట్ పనుల్లో ఎంతకు టెండర్ వేసింది..? ఇక్కడ మన పనుల్లో ఇప్పుడు తక్కువకు టెండర్ వేయడం ద్వారా నాసిరకం పనులు చేస్తారా..? లేక వాళ్లకు వేరే విధంగా లబ్ది చేకూరుస్తారా..? ఎందుకీ కక్కుర్తి రాజకీయాలు..? ప్రాజెక్టు భద్రతతో, కోట్లాది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడతారా..?
రెండున్నర ఏళ్లలో పోగొట్టిన విద్యుత్ ఉత్పత్తి నష్టమే ఐదారువేల కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులే అంటున్నారు. ఏడాదిలో రైతులకు పోయే పంట నష్టం ఇంకెంత ఉంటుందో..?
పవర్ హవుస్ పనుల పూర్తి గడువును 28నెలలనుంచి 58నెలలకు ఎందుకు పెంచారు..? 30నెలలు పెంచడం ద్వారా రెండున్నరేళ్ల విద్యుత్ ఉత్పత్తిని పోగొట్టారు. దానివల్ల రాష్ట్రానికి ఐదారు వేల కోట్ల నష్టం చేశారు. 
రూ.750కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటున్నారు కాని వాస్తవంగా రూ.7,500కోట్ల నష్టం చేశారు. పదిరెట్లు నష్టం చేస్తూ, ఆదా చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.
మేము జీర్ణించుకోలేనంత మీరేమీ ఆదా చేయలేదు. కోట్లాది ప్రజలకు, రాష్ట్రానికి మీరు చేస్తున్న నష్టాన్నే మేము జీర్ణించుకోలేక పోతున్నాం.
'బీహార్ ఆఫ్ సౌత్' అని ఆంధ్రప్రదేశ్ ను సీనియర్ జర్నలిస్ట్ అన్నారు. 'గవర్నమెంట్ టెర్రరిజం' తట్టుకోలేమని ప్రముఖ పారిశ్రామిక వేత్త అన్నారు. జాతీయ పత్రికల ఎడిటోరియల్స్ అన్నీ వైసిపి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్టను వైసిపి ప్రభుత్వం దిగజార్చింది. 
ఇష్టానుసారం చేయడానికి రాష్ట్రం మీ జాగీరు కాదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి అనేది గుర్తుంచుకోవాలి.
2).పిపిఏలపై వైసిపి నేతలు తలాతోకా లేని ఆరోపణలు చేశారు. పిపిఏలను రద్దు చేస్తూ వైసిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని హైకోర్టు కొట్టేసింది.
 టిడిపి ప్రభుత్వం 5ఏళ్ల పాలనలో ఏ జీవోను కోర్టులు కొట్టేయలేదు, అలాంటిది ఇప్పుడు 4నెలల్లోనే వైసిపి ప్రభుత్వ జీవోను కోర్టు కొట్టేయడం వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనం. 
ఆరోజు పిపిఏలపై మీరేం మాట్లాడారు..? అజయ్ కల్లం, పివి రమేష్, శ్రీకాంత్ తదితరులు ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు..?  ఇప్పుడు హైకోర్టు తీర్పుకు ఏ ముఖం పెట్టుకుంటారు..? 
మీరిచ్చిన జీవో చెల్లదని కొట్టేయడం కన్నా చెంపదెబ్బ ఏం కావాలి..? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నా, చట్ట ఉల్లంఘనలకు పాల్పడినా న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏం ఉంది..? పిపిఏలను క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, అది ఈఆర్ సి పరిధిలోని అంశమని చెప్పింది. ఇన్నాళ్లూ వైసిపి చేసిన ఆరోపణలు అవాస్తవాలు అనేది ఈ తీర్పుతో మరోసారి బైటపడింది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image