నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన

కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన
✍  నెల్లూరు జిల్లా సౌత్ మోపూరు పంచాయతీ మొగళ్ళపాళెం గ్రామ గిరిజన కాలనీకి చెందిన గిరిజన యానాది మహిళ పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి, భాదిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు  నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసన తెలియజేయడమైనది. మూతికి నల్లరిబ్బనులు కట్టుకుని నిరసన తెలిపారు.
✍ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలపల చంద్రమౌళి,
 వర్కింగ్   ప్రెసిడెంట్ B.L.శేఖర్, ఏకోల్లు లక్ష్మి, కత్తి చంద్ర, యందేటి లక్ష్మి, ఏకోల్లు చెంచురామయ్య పాల్గొన్నారు.
✍ డిమాండ్స్
1. జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి.
2. భాధిత మహిళకు ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల భూమి, 10లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని యానాదుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image