గూడూరు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి


నెల్లూరుః  గూడూరు రైల్వే స్టేషన్‌లో గూడూరు నుంచి విజయవాడ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించి 4, 5ప్లాట్‌ఫారాలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ కొత్త ప్లాట్‌ఫారాల ఏర్పాటుతో ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సురేష్‌అంగబడి, కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బల్లి దుర్గా ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.